Kumbha Rasi | ఉగాది కుంభ రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Kumbha Rasi | ఉగాది కుంభ రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

kumbha rasi

కుంభ రాశి

కుంభ రాశి:

ధనిష్ట 3, 4 పాదములు (గూ,గే,)

శతభిషం 1, 2, 3, 4 పాదములు (గో,సా,సీ,సు)

పూర్వాభాద్ర 1,2,3 పాదము (సే,సో,దా)

ఆదాయము - 08, వ్యయం 14, పూజ్యత- 7, అవమానం 5

గ్రహ సంచారం:

గురువు: ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు. తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము. శ్రీ విశ్వావను నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం|॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.

రాహువు :ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు :ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : ధనిష్ఠా నక్షత్ర జాతకులు పగడమునూ, శతభిషా నక్షత్ర జాతకులు గోమేధికమునూ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించవలెను. ఈ రాశి వారలకు 3-4-5-8-9 సంఖ్య లందు ప్రయాణం ధనలాభాదులను కలుగచేస్తాయి. ఆది, సోమ, గురు,శుక్ర వారములు కొత్తపనులు ప్రారంభిస్తే ధనాదాయము, వృత్తియందు అనుకూలతలు, విజయప్రాప్తి కలుగును.

నక్షత్ర ఫలము : ధనిష్ట నక్షత్రము 3, 4 పాదముల వారికి చరాస్తుల సమస్యలు, అనారోగ్య భాధ ధనవ్యయం, రాబడి సమానం. శతభిషం నక్షత్రమువారికి నిరుద్యోగ సమస్య తీరును, ధనయోగము. పిల్లల స్థితి శుభం. పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములవారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారము మిక్కుటము కాదు. ఈ రాశివారలకు మే, జూన్, ఆగస్టు,నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ఆకస్మిక ధనాప్రాప్తి వృత్తి యందు కలుగును.2, 3,6,9 తేదీలు, సోమ, మంగళ, శుక్రవారములందు ప్రయాణములు, ధన లాభములు సంతృప్తినిచ్చును. స్టార్ నెంబరు 8.

నెలల వారీగా ఫలితాలు:

ఏప్రిల్ : ఈ నెల శుభాశుభ్రములు తరచు వెన్నంటి యుండును. వృత్తి, వ్యాపారాల్లో స్పందన కలుగును. మాసాంతములో రావల్సిన బాకీలు వచ్చును. ధన నష్టమైన పనులు చేయక స్నేహితులతో సంచరించుట మంచిది. ఉద్యోగ, వ్యాపార, రాజకీయాదులకు మిశ్రమ ధనాదాయములు కలుగును. శనివారములందు జమ్మిచెట్టును అలంకరించి పూజించి, నువ్వులు నివేదన చేసిన శనిదోషము తొలగి ధనప్రాప్తి కలుగును.

మే : ఈ నెల మీ అభివృద్ధిని, ధన సంపాదననూ చూచి ఓర్వలేని తనముతో బంధువులు మిత్రులు సంచరించెదరు. ఆత్మీయ భావముతో సాటివారితో సంచరించేదరు. ఉద్యోగపరంగా వ్యతిరేకతలు రావచ్చును. ఇంటి యందు వృద్ధుల ఆరోగ్యము గూర్చి వ్యాఖ్యలతో ఇబ్బందులు పెట్టెదరు. మౌనముతో ఉండుట మంచిది. శుక్రవారములందు లక్ష్మీదేవిని పూలతో, కుంకుమార్చ నలతో పూజించి ప్రసాదు వితరణ చేసిన దారిద్య్ర బాధలు తొలగి ధన వర్షము కురియును.

జూన్ : ఈ నెల దీర్ఘకాలిక ఋణములు తీర్చే అవకాశము ఉన్నది. పెద్దలతో వ్యాపార చర్చల చర్చలు చేస్తారు. కొత్త వ్యాపారములకై దారులు అన్వేషణ బాగుగా యుండును. ఉద్యోగమునందు కిరాతక చర్యలు చేసేవారు. వృత్తి, వ్యాపార, రాజకీయములందు శతృత్వముచే ధననష్టము మాసాంతమున రావచ్చును. శనివారములందు జమ్మిచెట్టుకు అలంకరణ్, పూజలు చేసి నువ్వుల వుండలు నివేదనచేసి, కాకులకు, పక్షులకు పెట్టినచో గ్రహదోషములు, దారిద్య్ర బాధలు తొలగును.

జూలై : ఈ నెల తలచిన పసులు నెరవేరును. దూర ప్రయాణము లందు ప్రమాద సూచనలు వృత్తి యందు మిత్ర ద్రోహము. శతృవులుగా భావించి, వ్యాపార, ఉద్యోగ, నడుచుకోవాలి. ధనము దొంగతనము జరిగే అవకాశములున్నవి. మోసపూరిత పనులు జరుగవచ్చును. అన్ని వృత్తుల వారికి మిశ్రమాదాయము. లక్ష్మినారాయణులకు పూజలు చేసి, ప్రసాద వితరణ చేసిన కుటుంబ వృద్ధి, ధనవృద్ది, పిల్లల ఆరోగ్యము మెరుగు. మానసిక బాధలు నివృత్తి కలుగును.

ఆగస్టు : ఈనేల పూర్వపు వ్యక్తుల కలయికచే ఆనందకర విషయములు చర్చించెదరు. కుటుంబ విషయాలు చర్చలు ఆనందాన్ని ఇస్తాయి. వృత్తి, “వ్యాపార, రాజకీయ, కుటుంబ స్త్రీలు, విద్యార్థులకు అనుకూలమైన కాలము. పుణ్యనిధియగు అన్నవరం శ్రీ సత్యదేవుని వ్రతము చేయుట మంచిది. శనివారములందు మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి పూజలు, దర్శనమువలన తీవ్ర దారిద్ర్య బాధలు తొలిగి ధన ప్రాప్తి, వృద్ధి కలుగును.

సెప్టెంబర్ : ఈ నెల ఉద్యోగములో ప్రముఖులు పరిచయాలు. వ్యాపారంలో అనుకూలము. ఉద్యోగమునందు ప్రయాణములు అధికము. వృత్తి, వ్యాపారము లందు సామాన్య ధన లాభము. శనివారములందు శనిశ్వరుని పూజించుట మంచిది. సత్యసాయికి పూజలు, భజనలు చేసి, ప్రసాద వితరణ చేసినచో ఆరోగ్య వృద్ది కలిగి, ప్రశాంతత లభించును.

అక్టోబర్ : ఈ నెల యందు గ్రహస్థితి మిశ్రమము. వైరములకు దూరంగా ఉండండి. మీరు భావించిన ఆలోచనలు పూర్తి కావు కదా కొంత మిత్ర ద్రోహము సంభవించును. ఉద్యోగ భంగము రావచ్చును. వృత్తి, వ్యాపారాలు ధనలాభముతో యున్నను, సమస్యలందు తలదూర్చుట మంచిది కాదు. ఆరోగ్య భంగము, మంగళ వారములందు అంజనేయ స్వామివారికి స్వామివారి తమలపాకులతో పూజగావించి, గోధుమ అప్పాలు భక్తులకు వినియోగించిన ధనప్రాప్తి, పిల్లల వివాహ సమస్యలు తీరును.

నవంబర్ : ఈ నెలయందు విలువైన ఆస్తులు గూర్చి చర్చలు. వాటి విలువతో లబ్ది పొందాలని ఆలో చించెదరు. ఇతర దేశాలలో యున్న బంధు వార్తలు వింటారు. కొత్త వ్యాపారాలలో ప్రవేశించాలని, లబ్ది పొందాలనే ఆలోచనలు మంచి ఫలితాలు ఆలస్యముగా వస్తాయి. మీ పరువు, ప్రతిష్ఠ పెరుగుతుంది. మీరు పరులకు చెప్పిన సహాయవాక్యాలు మీకు వర్తించవు. భార్యాబిడ్డల సంగతిపై దృష్టి పెట్టుట మంచిది. శనివార ములందు నరసింహాస్వామివారికి తులసి, కలువ పూలతో అర్చనలు చేసి చక్కెర పొంగలి నివేదన, వినియోగము చేసిన పిల్లల చదువులు, వివాహములు కార్యసిద్దిని పొందుతారు.

డిసెంబర్ : ఈ నెల వారసత్వపు హక్కులు సంక్రమిస్తాయి. ఉన్నత స్థానములో యున్న స్త్రీలతో భాగస్వాములగుదురు. ధనదాయము పొందెదరు. మధ్య మధ్య ఆర్థిక బాధలు వచ్చినను, స్త్రీ వాదములు అచ్చి వచ్చి ధన సమస్యలు తీరును. శ్రీ శైల శంకరుని దర్శనం శుభయోగము నిచ్చును. మంగళ వారము లందు వినాయక, కుజ గ్రహ పూజలు చేసి కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం వ్యాపార బాధలను తొలగించును.

జనవరి : ఈ నెల ధార్మిక మార్గ ప్రవర్తనము చేస్తారు. క్రయ విక్రయాలందు జాగ్రతలు అవసరము. రాజకీయ రంగములో సంచారములు. శ్రమకు తగ్గ ఫలితములు సంభవించును. విష్ణు నామాలు చదవండి, వేంకటేశ్వర స్వామి వారి దర్శనము సకల శుభములు కలుగును. దోషములు తొలగి ధనప్రాప్తి కలుగును.

ఫిబ్రవరి : ఈ నెల ఋణదాతల వత్తిడి కలుగును, క్రయ విక్రయములు అనుకూలము, స్వయం వృత్తులు రాణించును. కొంత వెసులుబాటుగా ధనము వచ్చును. ఉద్యోగ వ్యవహారములు సామాన్యము. మంగళవారము లందు కుజగ్రహ పూజలు, దానములు శనివారములందు ఆంజనేయ నేయ స్వామికి పూజలు, ప్రసాదవితరణమువలన దుష్టగ్రహ పీడలు తొలగి సుఖశాంతులు కలుగును.

మార్చి : ఈ నెల వృత్తి వ్యాపారంలో సామాన్యము. ఆరోగ్యము, సమస్యలుగా మారును, ధార్మికత్వముతో సంచారము. అకాల భోజనము, శిరో బాధలు, ఉద్యోగ సాన చలనములు రావచ్చును. బుధవారములందు బుధు నికి పూజలు, దానములు విఘ్నేశ్వరునికి అభిషేకములు, పూజలు, ప్రసాద వితరణ చేసిన విఘ్నములు తొలిగి పరిస్థితులు సాను కూల మగును.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్