Karkataka Rasi | ఉగాది కర్కాటక రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు
కర్కాటక రాశి
కర్కాటక రాశి:
పునర్వసు 4 పాదము (హే)
పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హూ, హే,హో. డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ,డూ,డే, డో)
ఆదాయము 08,వ్యయం-2,పూజ్యత- 7,అవమానం 3
గ్రహ సంచారం:
గురువు : ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు, తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధున రాశియందు సంచారము. శ్రీ విశ్వావను నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం|| నుండి 28-03-2025 వరకు కుంభ రాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.
రాహువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీన రాశియందు 18-5-2025 కుంభరాశియందు సంచారము.
కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.
నక్షత్ర జాతకులు అదృష్టం : పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగమునూ, పుష్యమీ నక్షత్ర ఇంద్రనీలమునూ, ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చరాయి ధరించవలేను. ఈ రాశి వారలకు 2-3-6-9 సంఖ్యల రోజుల్లో ధనప్రాప్తి కలిగించును. ఆది, సోమ, మంగళ, శుక్రవారములందు ప్రయాణము చేస్తే తలచిన పనులు పూర్తియగును. స్టార్ నెంబరు 2.
నక్షత్రఫలము : పునర్వసు నక్షత్ర 4 పాదము వారికి గృహనిర్మాణ ఖర్చులు, తలచిన పనులు పూర్తి, ఉద్యోగప్రాప్తి, పుష్యమి నక్షత్రమువారికి కోరినచోట ఉద్యోగము, ధనప్రాప్తి.మిశ్రమాదాయం. ఈ, ఆశ్లేష నక్షత్రం వారికి దూర ప్రయాణములు, ఋణములు దొరకును. ఈ రాశి వారికి ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబరు, జనవరి నెలల్లో ధనలాభము కలుగును 4,6,8 తేదీలు ఆది, సోమ, శుక్ర, శనివారాల్లో ప్రయాణములు, ధనలాభములు.
నెలల వారీగా ఫలితాలు
ఏప్రిల్ : ఈ నెల ధన ఇక్కట్లు తప్పవు. ప్రయాణములు మార్చుకొనుట ముఖ్యము, చిన్న పరిశ్రమ వాళ్ళకు కొన్నినష్టములు రావచ్చును. నేత్ర బాధలు రావచ్చును, ధనాదాయము మిశ్రమము, ఆదివారములందు సూర్యదేవునికి, రవిగ్రహమునకు పూజలు చేసి, ప్రసాదములను వితరణచేసిన సర్వదోషములు తొలగి, ఆరోగ్యము, ధనప్రాప్తి కలుగును.
మే : ఈ నెల ప్రణాళికా బద్దంగా వ్యవహరించట మంచిది, వాహన యోగములున్నవి. వృత్తియందు శ్రమకు తగిన ఫలితం లబిచును. తలచిన పనులు పూర్తియగును. పాత బాకీలు తీర్చెదరు. నూతన గృహస్థుల చర్చలు ఫలిస్తాయి. ధనాదాయము సామాన్యము. మంగళవారంలందు కుజగ్రహ పూజలు, ప్రసాద వితరణ చేసిన దోషనివృత్తి కలుగును.
జూన్ : ఈనెల కొంచెం ఋణములు చేస్తారు. ధాయాది పోరుతో బాధలు అనుభవిస్తారు. ప్రేమ వ్యవహారములలో బిడ్డల సమస్యలు వర్తిస్తాయి. భార్యా పిల్లల బంధు శ్రేణి వాద ప్రతివాదములతో తిరుగుబాటు తనము దాపరించును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు సామాన్య స్థితిలో ఉండును. శుక్ర గ్రహ సన్నిధి ప్రదక్షిణము చేసి మేడి చెట్టు పూలతో పూజలుచేసి బొబ్బర్లు అన్నము వండి కాకులకు, గ్రద్దలకు వేసిన దారిద్య్ర బాధలు, భార్యాభర్తల సమస్యలు తొలగును. ఆడపిల్లలకు అదృష్టము కలుగును.
జూలై : ఈనెల దురాశతో చేసే పనులు వికటిస్తాయి. స్వల్ప ద్రవ్య లాభాదులు కలుగును. వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు శుభప్రదముగా ఉండును. పరోపకారములందు చేసే విషయములలో తరుచు జాగ్రత్త వహించాలి. అన్నవరం శ్రీ సత్యదేవుని వ్రతముచేసిన వ్యాపారవృద్ది, కుటుంబ వృద్ధి, ధనప్రాప్తి కలుగును. సంతాన సమస్యలు తీరును.
ఆగస్టు : ఈనెల అననుకూల కాలము. శారీరక, మానసిక సమస్యలు. ఋణములు చేస్తే ఇబ్బందులు పొందుతారు. స్త్రీ వాదములు అతిగా ఉండును. ప్రయాణములందు మరణముల అతిగా చూడరాదు. తన కర్తవ్యములే రెంగి మీవృత్తి వ్యాపారాదుల్లో సంచరించుట మంచిది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రములను జపించి, శనివారములందు నవగ్రహ పూజలు చేసిన గ్రహ బాధలు తొలగును.
సెప్టెంబర్ : ఈ నెల అనుకూల గ్రహస్థితి. ఇష్టమైన కార్యములు పూర్తి. గతమందున్న సమస్యలు తొలగును. మీరు విజయానికి నిరంతరం కృషి చేయుట మంచిది. విద్యార్ధి లోకం తన కర్తవ్యాన్ని గ్రహించి నడుచుట శ్రేయోదాయకము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు అనుకూలత. ధన లాభములు. మంగళవారములందు నరసింహాస్వామికి తులసిపత్రితో అర్చించిన దాయాది దోషములు తొలగును. సంతాప్రాప్తి, కార్యసిద్ధి కలుగును.
అక్టోబర్ : ఈ నెల గ్రహస్థితి యోగమున్ననూ దేవాలయములో పూజలు చేయుట మంచిది. విష్ణు నామాలు చదువుకొనుట మంచిది. మీ కోర్టు వ్యవహారములు తొలగును. ఆరోగ్యము మిశ్రమము. వృద్ధులు, పెద్దల మాట వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయులకు శుభకాలము లేదని గ్రహించేది. విద్యార్థులకు మిశ్రమము. సామాన్య ధనప్రాప్తి, గురువారలందు గురువునకు, దక్షిణామూర్తికి పూజలుచేసి, ప్రసాద వితరణ చేసిన గ్రహ దోషములు తొలిగి వ్యవహార జయము కలుగును.
నవంబర్ : ఈనెల గృహ, వాహన యోగములు, బిడ్డల చదువు చదువులు ఆనందాన్ని ఇస్తాయి. దీర్ఘ కాలంగా ఉన్న మీ కోరికలు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చును. ప్రయాణ ప్రమాద సూచనలు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కార్యసిద్ధినిస్తాయి. శుక్రవారములందు లక్ష్మీదేవి, కన్యకాపరమేశ్వరి అమ్మ వార్లకు కుంకుమ పూజలు చేసి, ముతైదువులకు పసుపు, కుంకుమ వితరణ చేసిన చేసిన ధనప్రాప్తి కలుగును.
డిసెంబర్ : ఈనెల గ్రహస్థితి కార్యానుకూలముగా ఉన్నది. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తిని గురించి, నిర్మాణముల గురించి ఆలోచించెదరు. కుటుంబ సభ్యుల ఆశలు అతిగి వుంటాయి. ఆభరణముల ఖరీదు ఆలోచనలు. వృత్తి యందు సామూహిక ధనలాభము. మంగళ వారము లందు కుజనికి గన్నేరుపూలతో పూజలు చేసి, కందులు దానము చెయ్యాలి. కంది పప్పు, బెల్లం కలిపి ఆవులకు ప్రదక్షిణములు చేసి వితరణ చేసిన ఋణములు, బంధు వైరములు తొలగును.
జనవరి : ఈ నెల గ్రహస్థితి అనుకూలముకాదు, దైవపూజలు చేయుట మంచిది. బిడ్డల విషయమై చర్చలు, చికాకులు కల్గించును, ఆధ్యాత్మిక కార్యక్రమములు చేస్తారు. దూర బంధు మరణవార్తలు వింటారు, విలువైన వస్తువులు ఖరీదులు చేస్తారు, ధనాదాయము. శుక్రవారంలందు లక్ష్మీదేవి పూజలు, కుంకుమాదులతో అర్చనలు చేసిన ఆరోగ్య, ధనప్రాప్తి కలుగును.
ఫిబ్రవరి : ఈనెల ఆర్థిక లాభము కలుగును. కుటుంబ స్థితిగతులు ఉత్తేజముగా, లాభముగా ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలుచేస్తారు. ఆలోచనలు ఫలించును.దాయాది పోరుతో చికాకులను తొలగించుకొనుచూ ముందుకు సాగుట మంచిది. వృత్తి, వ్యాపారలందు ధన లాభములు. శివాభిషేకములు చేసిన కార్యసిద్ధి కలుగును. సోమవారము లందు నాగేంద్ర పుట్టలో పాలుపోసిన గర్భ దోషము, శతృ దోషము తొలగి సంసార సుఖము కలుగును. గోవులకు ఉలవలు వండి తినిపించిన ప్రయాణ బాధలు తీరును.
మార్చి : ఈ నెల ఆర్ధిక లావాదేవీలు అనుకూలం. ఆసక్తికరమైన విషయాలలో పాల్గొంటారు. జీవిత ఆశయం దిశగా పయనించేదరు. రాజకీయంగా నష్టాలు, ఇబ్బందులు అధిగమిస్తారు. ఉద్యోగ చలనములు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు ధనదాయము. సొంత విషయాలందు ఆలోచనతో మెలగాలి.శనివారములందు జమ్మి ఆకులతో శనికి పూజలు చేసి నువ్వులు దానము చేసిన దరిద్రము తొలగును.