Kanya Rasi | ఉగాది కన్యా రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Kanya Rasi | ఉగాది కన్యా రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

kanya rasi

కన్య రాశి

కన్యారాశి:

ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)

హస్త 1, 2, 3, 4 పాదములు (పూ, షం, ణా, రా)

చిత్త 1,2 పాదములు (పే,పో)

ఆదాయము 14, వ్యయం-2, పూజ్యత- 6, అవమానం 6

గ్రహసంచారం:

గురువు : ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశి యందు, తదు పరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము, ఏరి -విశ్వావసు నామ సం||ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీన రాశియందు సంచారము చేయును.

రాహువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపునూ, చిత్తా నక్షత్ర జాతకులు పగడమును ఉంగరముగా ధరించ వలెను. ఈ రాశి వారలకు 1-3-5-8-9 సంఖ్యలందు ప్రయాణములు చేస్తే ధనప్రాప్తి, వ్యవహారజయము కలుగును. ధనలాభములు కలుగుతాయి. ఆది, బుధ, గురు, శుక్రవారములు తలచినపనులు పూర్తి, ధనలాభము కలుగుతాయి.

నక్షత్ర ఫలము : ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదములవారికి పిల్లల స్థితి అనుకూలము, మిశ్రమాదాయము, హస్త నక్షత్రము వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు, ధనప్రాప్తి, కార్యసిద్ధి. చిత్త నక్షత్ర 1, 2 పాదముల వారికి దూరప్రయాణములు, కుంటుంబ సంతోషము, ధనప్రాప్తి. ఈ రాశి వారలకు మే, జూలై, సెప్టెంబరు, నవంబరు, డిశెంబరు, జనవరి నెలల్లో ధనలాభము, కార్యసిద్ధి. 1,3,6,8 తేదీలు, ఆది, బుధ, గురు, శుక్రవారములందు ప్రయాణము కార్యసిద్ధి, ధనప్రాప్తి. స్టార్ నెంబరు 5

నెలల వారీగా ఫలితాలు

ఏప్రిల్ : ఈ నెల ప్రతికార చర్యలు అధికం, కోపం తగ్గించు కోనుట మంచిది. యందు వివాహాది శుభకార్యములు కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు, ఋణములు ఇంటియందు కొన్ని తీరును. స్థిరాస్తి వ్యవహారములు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో మిశ్రమం. శుక్రవారములందు లక్ష్మి కుంకుమ పూజలు చేసి ముతైదువులకు పసుపు, కుంకుమ వితరణచేసిన రావల్సిన ధనం వచ్చును.

మే : ఈ నెల గ్రహముల మిత్రత్వముచే అరుదైన రాజయోగము, కీర్తి కలుగును. అధికారులతో పరిచయాలు అధికము. ఆనంద రూపమైన విషయాలు చర్చించి, మిత్రత్వముతో వుంటాయి. చేతివృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయులకు ధన ఇబ్బందులు కొన్ని వస్తాయి. ఆరోగ్యము బాగుండును. గురువారములందు సాయిబాబాకు రావి ఆకులతో, పూలతో పూజలు చేయించిన ఉద్యోగ ప్రాప్తి, వ్యవసాయదారులకు పాడిపంటలు అనుకూలంగా ఉంటాయి.

జూన్ : ఈ నెలయందు మహోన్నత వ్యక్తుల స్నేహం లభిస్తుంది. కృషి, తెలివి తేటలతో వ్యాపారము వృద్ధి. నరదృష్టి అధికము. లక్ష్మీనరసింహా పూజలు గురువారము చేయుట మంచిది. వృత్తి వ్యాపార, ఉద్యోగస్తులకు తలచిన పనులు నెరవేరును. సామాన్య ధన ప్రాప్తి, గురువారములందు సాయిబాయి పూజలు చేసిన సాధువులకు ప్రసాద వితరణ చేసిన ఉద్యోగ ప్రాప్తి, ఋణ బాధలు తీరును.

జూలై : ఈనెల గ్రహస్తితి మిశ్రమము. స్త్రీల అధిక్యత, ఇంటియందు భార్య, పిల్లల కోరికలు తీర్చుట యందు చికాకులు వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రాజకీయ వారలకు ధనము ఖర్చు పెట్టిననూ, గౌరవ మర్యాదలతో కాలం గడుపుచూ ఆనందాన్ని పొందెదరు. సోమవారములందు మోదుగ చెట్టును పూజించిన గ్రహ పీడలన్నియునూ తొలగి ధనప్రాప్తి కలుగును.

ఆగస్టు : ఈ నెలయందు ఆదాయానికి ఖర్చునకు సరిపడునట్లు మాత్రమే ధనము వచ్చును. శ్రమించిననూ ఫలితము తగ్గే అవకాశమున్నది. ఆరోగ్య భంగము. బంధు మరణ వార్తలు వింటారు. మిగులు ధనము కోసము ఆలోచించి చికాకులు పొందెదరు. శనిపూజ చేసిన కొంత ఫలితముతో ధనము సాదించెదరు. శనివారములందు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తులసిదళాలతో అర్చనలు చేసిన ఆర్థిక, వ్యవహార సమస్యలు తొలగును.

సెప్టెంబర్ : ఈ నెల మరణ వార్తలు వింటారు. శ్రమకు తగిన ఆదాయము. వ్యాపారాలందు అధికారుల వత్తిడి, చికాకులు. పిల్లలు దారి తప్పే అవకాశము కలదు. భార్య కూడా తగిన విధంగా ఆలోచించి పిల్లల కోరికలను నిశిత విమర్శ చేసుకొనుట మంచిది. వృత్తివారికి సామాన్య స్థితి. సోమవారములందు మృత్యుంజయ మంత్రము జపించి, ఈశ్వర అభిషేకములు, అన్నదానము చేసినచో ప్రమాదములు తొలగి, ఆరోగ్య శాంతి, అధిక సుఖములు కలుగును.

అక్టోబర్: ఈనెల గ్రహస్థితి అత్యంత ప్రతికూలము. మరణ వార్తలు వినుట. బంధు గృహప్రవేశములు, చికాకులు, ధన వ్యయములు. పుణ్యానికి వేళితే పాపము కొంత వస్తుంది. మాస మధ్య నుండి తలచిన పనులు పూర్తిచేయగలరు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ, రాజకీయాదులు ధనాదాయము. విద్యార్థులకు కోర్కెలు తీరును, అన్యోన్య కుటుంబ ఆనందములు కలుగును.

నవంబర్ : ఈనెల ఉద్యోగులు పై అధికారుల మన్ననలు పొందుతారు. ఒత్తిడి యందు పనులు అధికము. మాస మధ్యలో దూర ప్రయాణములు చిక్కులు తెస్తాయి. భార్యకు అనారోగ్యములు రావచ్చును. పిల్లల విద్యలు చక్కగా ఉండును. శివ క్షేత్రముల దర్శనము మంచిచేకూర్చును. నదీ స్నానములచే పాపములు తొలగిపోవును. వృత్తి, వ్యాపార, వ్యవసాయాదులు ధనలాభాములు బాగుగా ఉండును.

డిసెంబర్ : ఈనెల శారీరక శ్రమ కలుగును. తలచిన ఆభరణ వస్తువులు ఖరీదు చేయాల్సిందే. ధన వ్యయము కొంత బాధించును. మాసాంతములో రావల్సిన బాకీలు వచ్చును. స్వతంత్ర జీవన విధానము అలవరచు కొనుట శ్రేయోదాయకము. మిశ్రమ ఆరోగ్యము. వైద్య ఖర్చులు తప్పవు. నందీశ్వర ప్రదక్షిణములు శుభాలు కలుగును. శుక్రవారములందు లలితాదేవి నామాలు చదివి ముతైదువులకు, పసుపు, కుంకుమ, చీరెలు వితరణ చేయటం మంచిది. వృత్తి, వ్యాపారములందు ధనప్రాప్తి యోగము.

జనవరి : ఈనెల అధికారగణముతో సమస్యలు, ధనార్జనలు, దూర ప్రయాణములు, కోర్టు సమస్యము, ధనార్జనలు, ఋణములు, కుటుంబ సమస్యలు రావచ్చును. పుణ్యక్షేత్ర సంచారము, ధనరాబడి, వ్యాపార ఇబ్బందులు కొన్నివచ్చును. మనోవేధన, చింత, సంతాన సమస్యలు, శ్రీమతికి ఆరోగ్య యోగాదులు. మంగళవారం కుజునికి ఎర్రనిపూలతో పూజించి బెల్లం, కంది పప్పుదానము చేస్తే నరఘోష తొలగి ధనప్రాప్తి కలుగును.

ఫిబ్రవరి : ఈ నెల ఆర్ధిక వ్యవహారములు మెరుగుపడును, రావలసిన బాకీలు వచ్చును, కొన్ని ఋణములు తీర్చెదరు. రాబడి తగ్గును, ప్రయాణములు అధికము, కుటుంబ పురోభివృద్ధి. కార్యరూపముతో సంచారములు చేస్తారు, కొన్ని ఆటంకాలు వస్తాయి. ధనవృద్ధి కలుగును. మంగళవారము లందు కుజగ్రహ, విఘ్నేశ్వర పూజలు, దర్శనము, ప్రసాద వితరణ చేసిన వ్యాపార బాధలు తీరును. దోషములు తొలగును.

మార్చి : ఈ నెల నూతన వివాహ విషయ చర్చలు పూర్తి కావచ్చును. సంతోషకరము, బంధు దర్శనము కలుగును. అనుకోని అవకాశములు లభించును, వృత్తి వ్యాపార ఉద్యోగములందు సామాన్యము కంటె అధికము. ఆదివారములందు సూర్యగ్రహ దర్శనము, పూజలు చేసిన ఆరోగ్య దోషము, ఋణ సమస్యలు తొలగును.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్