Dhanassu Rasi | ఉగాది ధనస్సు రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Dhanassu Rasi | ఉగాది ధనస్సు రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

dhanassu rasi

ధనస్సు రాశి

ధనస్సు:

మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బి)

పూర్వాషాడ 1,2,3,4 పాదములు (బూ.దా.భా.ఢా)

ఉత్తరాషాడ 1 పాదము (బే)

ఆదాయము-05, వ్యయం-05, పూజ్యత- 1, అవమానం-5

గ్రహసంచారం:

గురువు: ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు. తదుపగి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము. శ్రీ విశ్వావను నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.

రాహువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం మూల నక్షత్ర జాతకులు వైఢూర్యమునూ. పూర్వాషాడ నక్షత్ర జాతకులు వజ్రమునూ, ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు కెంపుయునూ ధరించ వలెను. ఈ రాశివారలకు 1-2-5-6 -9 సంఖ్యలందు ప్రయాణం చేస్తే తలచిన ప్రయత్నములు పూర్తియగును. ఆది, బుధ, గురు వారాలందు పనులు ప్రారంభిస్తే మిత్రలాభం, ధనలాభాలు కలుగును,

నక్షత్ర ఫలము : మూల నక్షత్రము వారికి చింతన, శతృబాధలు, యాత్రలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సమస్థితి. పూర్వాషాడ నక్షత్రమువారికి ధన ఇబ్బందులు, జాయింటు సమస్యలు, సమయానికి ధనము. ఉత్తరాషాడ నక్షత్రము 1 పాదమువారికి కలహములను చేధించెదరు. ఆకస్మిక ధనలాభములు. ఈ రాశివారలకు ఏప్రిల్, మే, అక్టోబరు, నవంబరు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రయాణములు, ధనయోగములు, కార్యసిద్ధి, 1,2,5,9 తేదీలు, ఆది, బుధ, గురువారము లందు ప్రయాణములు, ధనప్రాప్తి, స్టార్ నెంబరు 3.

నెలల వారీగా ఫలితాలు: 

ఏప్రిల్ : ఈ నెల విలువైన స్థిరాస్తులు తక్కువ ధరలో లభించు అవకారములున్నాయి. ధనము సకారమునకు అందవచ్చును. యాత్రలు దిగ్విజయముగా వుంటాయి. ఇంటి యందు శుభకార్య యోచలున్నయి. పిల్లల జీవన విధానం అనుకూలము. వృత్తి, వ్యాపార, రాజకీయ, ఉద్యోగములందు శ్రమకు తగిన ఆదాయము, గౌరవము లభించును. బుధవారములందు పండరీనాధుని పూజలు చేసి ప్రసాద వితరణ చేసిన దారిద్య్ర్య బాధలు తొలగి ధనప్రాప్తి కలుగును.

మే : ఈ నెల అన్ని రంగములందు అనుకూలము. భార్యాబిడ్డల సౌఖ్యము, ధనాదాయము. కుటుంబ కార్యములు కొన్ని పూర్తి బందు మిత్రులతో ఆనందముగా గడుపుతారు ఆభరణముల ఖరీదు. ఇంటియందు ఉద్యోగప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, సర్వజనులకు ధనాదాయము. మోపిదేవి నాగేంద్రస్వామివారికి అర్చనలు, పూజలు చేసిన గర్భదోషములు తొలగి ధనయోగము కలుగును.

జూన్ : ఈ నెల దుష్టజన సహవాసము మంచిది కాదు. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. భవిష్యత్తుపై చర్చలు చేస్తారు. కొత్త ఆశలు పుట్టును. కొన్ని కార్యాలు పూర్తి కావచ్చును. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగును. మాసాంతమున వృత్తుల వారికి ధనాదులు కలుగును. శని పూజలు తప్పనిసరి. బుధ వారములందు గణేశేనుకి పూజలు, కుడుములు, ఉండ్రాళ్ళు, చెరకురసము నివేదన చేసిన రాబోవు కార్యములన్నియు శుభముగా యుంటాయి.

జూలై : ఈ నెల ఆర్థికాభివృద్ధి యున్ననూ ప్రతి పనియందు శ్రద్ధగా మెలగాలి. దూరప్రాంత బంధువులతో చర్చలు ఫలిస్తాయి. పిల్లలు విద్య యందు రాణింస్టారు. వారి కర్తవ్య ఉద్యోగ ప్రాప్తియోగాన్ని గూర్చి ఆలోచించెదరు. కొన్ని ఉద్యోగ వివాహ సమస్యలు రాణిస్తాయి. శని గ్రహపూజలు మరవద్దు. సోమవారం లందు పంచామృతాభిషేకములు ఈశ్వరునికి చేసిన దారిద్ర్య బాధలు తొలగి ధనప్రాప్తి కలుగును.

ఆగస్టు : ఈ నెల వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా వస్తాయి. స్త్రీలకు మానసికి చింత కొంత కలుగును. శారీరక పుష్టి మందగించును. మాసాంతమున మనోనైర్మల్యము లభించును. వృత్తి, వ్యాపార, రాజకీయ రంగాల్లో అనుకూలము. వృత్తియందు ధన సంపద, ఋణ విముక్తి. శ్రీకాళహస్తిశ్వరుని దర్శనము, రాహు, కేతువులు పూజలు మంగళవారము చేసిన అనేకమైన దోషములు తొలిగి వ్యాపార, ఆరోగ్య సమస్యలు తీరును.

సెప్టెంబర్ : ఈ మాసము నందు ఖర్చులు అదుపు చేయాల్సిన అవసరము ఉంది. పిల్లల విధులందు జాగ్రత్త వహించాలి. ఆదాయ మార్గాలే పరిష్కారమని భావించి నడుచుకోవాలి. వ్యాపార పరమైన ఆలోచనలు కొన్ని వస్తాయి. వ్యక్తిగత ఆలోచనములు ముఖ్యము. శుక్రవారము లందు దుర్గాదేవికి లలితా నామాలతో కుంకుమార్చన చేసిన ఆరోగ్యము, భార్యభర్తల సమస్యలు తీరగలవు.

అక్టోబర్ : ఈ నెల కోప స్వభావంతో కార్యములు చేస్తారు. ఉద్యోగము నందు సరియైన క్రమ పద్ధతి లోపించును. శారీరక వేడి, ఔషధ సేవనము తప్పదు. కంటి వ్యాధులు పెరుగును. శని ప్రభావముచే మానసిక బాధలు తప్పవు. శక్తికి పూజలు చేయుట మంచిది. శనివారములందు జమ్మిచెట్టుకు అలంకరణ చేసి నువ్వులు, తదితర ప్రసాదములు నివేదన చేసిన వ్యాపార శని దోషము తొలగి ధనప్రాప్తి కలుగును.

నవంబర్ : ఈ మాసము కొత్త ఆలోచనలు నెరవేరును. కొత్త సంస్థలు ప్రారంభించెదరు. తల్లిదండ్రులు ఆరోగ్య బాధలు కొన్ని ఇబ్బందులు పెట్టగలవు. ఊహించని రాజకీయాలు ఎదురవును. వ్యాపార, వృత్తి, ఉద్యోగములందు ఈర్ష్య ద్వేషాలతో నిండి యుండును. మాసాంతమున ధనాదాయము. గోవును పూజించి, పండ్లు నవధాన్యాలు నివేదించిన దేవతల దీవెనలు లభించును. అనేక శుభములు కలుగును.

డిసెంబర్ : ఈ మాసము ఆడంబరాలకు పోయి ధనం ఖర్చు పెట్టి నిందారోపణములతో చింతించెదరు. సంతాన సౌఖ్యాలు తీరును. నిర్మాణములు జరుగుతాయి. మాస మధ్యలో మరణ వార్తలు విని చింతనలు ఉంటాయి. మరణ వ్యక్తుల కార్యాల్లో పాల్గొనెదరు. మిశ్రమ ధనాదా యము. ఇంటి యందు స్త్రీలను ఆహ్వానించి లలితా సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము చేసి, ప్రసాద వితరణ చేసిన దోషములు తొలగి ఋణములు తీర్చెదరు. వృత్తి, వ్యాపారములు బాగుగా యుండును.

జనవరి : ఈ నెల అశుభ కార్యములందు పాల్గోనెదరు. ధనవ్యయము, బంధుమిత్ర వ్యవహారిక చింతలు కలుగుతాయి. ఇంటి సమస్యలు పోవును, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారము లందు రాణింపు. సోమవారము లందు ఈశ్వరునికి అభిషేకములు, పూజలు చేసిన సకల దోషములు తొలగును శుభములు కలుగను,

ఫిబ్రవరి : ఈ నెల వృధా వాదోపవాదములు. మనోవిచారము కలుగును. దూరపు బంధు మరణములు, అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక అవసరములు తీరును, ఋణములు పొందుతారు. ధనాదాయము. మంగళవారములందు ఆంజనేయ స్వామివారికి ఆకు పూజలు, ప్రసాద వితరణముల చేసిన మానసిక ఒత్తిడులు, దోషములు తొలిగి ధనప్రాప్తి కలుగును.

మార్చి : ఈ నెల శక్తి సామర్థ్యములతో పనులు సాధించెదరు, పిల్లల కట్నకానుకల చర్చలు హృదయానంద పనులు చేస్తారు. శ్రామిక జనులతో సంచారము. మిశ్రమ ఆదాయ ధననష్టములు కొన్ని రావచ్చును. ఆదివారములందు సూర్య భగవానునికి, రవిగ్రహ పూజలు, ప్రసాద వితరణము జయములు కలుగును. ధనప్రాప్తి, సర్వ కార్యములందు విజయము.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్