తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది అనే పదం యుగం, ఆది అనే రెండు పదాల కలయిక. యుగం అంటే యుగం లేదా కాలం. ఆది అంటే ఏదో ఒకదాని ప్రారంభం.
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది అనే పదం యుగం, ఆది అనే రెండు పదాల కలయిక. యుగం అంటే యుగం లేదా కాలం. ఆది అంటే ఏదో ఒకదాని ప్రారంభం. కాబట్టి ఉగాది పండుగ రోజు నుంచే తెలుగు నూతన సంవత్సరం ప్రారభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ప్యాడమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత ఆయన రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. ఈ వేడుక వాస్తవానికి ఉగాది రోజుకు ఒక వారం ముందు ప్రారంభమవుతుంది. ఒక్కో ఏడాది ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది.