తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నడిచి వచ్చేవారికి దివ్యదర్శనం టికెట్లు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||తిరుమల తిరుపతి దేవస్థానం||

ఈవార్తలు, ఆధ్యాత్మికం:తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి నడక దారిలో వచ్చే భక్తులకు రోజుకు 10 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీవారి మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు కరోనాకు ముందు ఇచ్చినట్లే, ఏప్రిల్ 1 నుంచి దివ్యదర్శనం టోకెన్లు అందజేస్తామని వివరించారు.

వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎండాకాలంలో భక్తుల తాడికి ఉంటుందని, అందువల్ల బ్రేక్ సిఫార్సులు తగ్గిస్తామని స్పష్టం చేశారు. ఫేస్ రికగ్నిషన్‌తో పారదర్శకంగా అకామిడేషన్ సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా, కరోనా సమయంలో దివ్యదర్శనం టోకెన్లు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ఇస్తామని టీటీడీ ప్రకటించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఏప్రిల్ నెల వసతి గదులను మార్చి 29 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్