Tirumala : ఈ నెల 13న తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తిరుమల తిరుపతి దేవస్థానం||

ఈవార్తలు, తిరుమల: తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ కోటా టికెట్లను ఈ నెల 13న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి ఆలయంలో బాలాలయ నిర్మాణ కారణంగా ఈ నెల 22 నుంచి 28 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను విడుదల చేయలేదు. అయితే, బాలాలయ నిర్మాణాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజుల్లో కోటా టికెట్లను సోమవారం విడుదల చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. అటు.. మార్చి నెల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటా టికెట్లను శనివారం (ఫిబ్రవరి 11వ తేదీ) ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్