TTD News | తిరుమల వెంకన్న లడ్డూ ధరలు తగ్గాయా.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ (Srivari Laddu) ధరలు తగ్గాయంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అదేవిధంగా శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ రూ.300 ధరలోనూ మార్పులు చేసినట్లు విస్తృతంగా ప్రచారమైంది.

tirumala laddu

తిరుమల లడ్డు

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ (Srivari Laddu) ధరలు తగ్గాయంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అదేవిధంగా శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ రూ.300 ధరలోనూ మార్పులు చేసినట్లు విస్తృతంగా ప్రచారమైంది. ఈ వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) క్లారిటీ ఇచ్చింది. రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో, ప్రత్యేక ప్రవేశ ధర్మనం రూ.300 టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసింది. ధరలను సవరించినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని తెలియజేసింది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం భక్తులు దళారులను సంప్రదించవచ్చని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధిక ధరలు చెల్లించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందవచ్చని వాట్సాప్ గ్రూపుల్లో వార్త ప్రచారం అవుతోందని, దాన్ని నమ్మవద్దని సూచించింది.

‘శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్‌సైట్ సహా.. పలు రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొన్ని టికెట్లు కేటాయించాం. భక్తులు ఆయా టూరిజం శాఖల ద్వారా టికెట్లు పొందవచ్చు. ఎవరూ దళారులను నమ్మొద్దు. భక్తులు దీన్ని గమనించాలి. టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు నమ్మిస్తున్నట్లు, అందుకు ధర ఎక్కువ అవుతుందని డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీని పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలి. భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ కఠినంగా చర్యలు తీసుకుంటుంది’ అని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్