తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే ఫిబ్రవరి నెలకు గానూ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ బోర్డు విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
ప్రతీకాత్మక చిత్రం
తిరుమల, ఈవార్తలు : తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే ఫిబ్రవరి నెలకు గానూ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ బోర్డు విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నంం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. భక్తులు టీటీడీ అధికారి వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in, యాప్‌లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఇక.. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెల అంగ ప్రదక్షిణం టికెట్లు, మధ్యా్హ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి శ్రీవారి దర్శనం కల్పించేలా ఉచిత దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.
నవంబర్ 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. ఆ నెలకు సంబంధించి గదుల టికెట్లు 25వ తేదీనే మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. నవంబర్ 27వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ టికెట్లు, మధ్యాహ్నం 12 గంటకలు నవనీత సేవ టికెట్లు, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.