Vastu Tips: మీ ఇంట్లో ఈ దిక్కున లోహంతో చేసిన తాబేలు ఉంచితే లక్ష్మీదేవి కొలువుదీరినట్లే

తాబేలును కుబేరుడిగా పూజిస్తుంటారు. కొన్నేండ్ల క్రితం ఇళ్లలో బావులు ఉన్నప్పుడు అందులో తాబేళ్లను పెంచేవారు. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో తాబేలు కనిపిస్తుంటాయి.

VASTU TIPS

ప్రతీకాత్మక చిత్రం 

తాబేలును కుబేరుడిగా పూజిస్తుంటారు. కొన్నేండ్ల క్రితం ఇళ్లలో బావులు ఉన్నప్పుడు అందులో తాబేళ్లను పెంచేవారు. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో తాబేలు కనిపిస్తుంటాయి. కానీ కాలం గడిచినా కొద్దీ ఇలాంటి ప్రాణులను పెంచుకోవడం చట్టవిరుద్ధంగా మారింది. అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆర్థిక స్థితి బాగుండాలని కోరుకునే చాలా మంది లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకుంటున్నారు. ఏ దిశలో లోహపు తాబేలు ఉంచితే మంచిది? ఆర్థిక సమస్యలు పోయి అద్రుష్టం  కలిసి రావాలంటే ఎక్కడ ఉంచాలి. 

వాస్తు ప్రకారం ఇళ్లలో ఏ ప్రదేశంలో ఏ వస్తువు ఉంచితే మంచిదో శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం చేసే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తుంటారు.కూర్మావతారం అనికూడా అంటారు. అందుకే తాబేలు ఇంట్లో ఉంటే విష్ణుమూర్తి ఉన్నట్లే అంటారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచితే విష్ణుమూర్తి కరుణ లభిస్తుంది. 

లోహపు తాబేలును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఉట్టిగానే ఉంచకూడదు. దాన్ని నీటితో నింపిన పంచలోహపు గిన్నె లేదా ప్లేటులో ఉంటాయి. తాబేలు నీటిలోనే జీవిస్తుంది. కాబట్టి ఇలా చేయడం మంచిది. ఇక లోహపు తాబేలును ఇంట్లో ఉత్తర దిశలో ఉంచడం శ్రేయస్కారం. అనారోగ్యాలుంటే నయం అవుతాయి. వ్యక్తిత్వపరంగా కూడా మెరుగవుతారు. ఆత్మవిశ్వాసం పెంపోందుతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉత్తర దిశలో పంచలోహపు తాబేలు ఉంచితే ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటుండదు. డబ్బు సంపాదనకు తగిన మార్గాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. 

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎప్పుడూ ఇంట్లో కలతలు, గొడవలు ఏదొక సమస్య ఉంటున్నా పంచలోహపు తాబేలును ఉంచడం మంచిది. ఇది ఇంటికి సానుకూల శక్తిని చేకూరుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్