నేడే అమావాస్య.. ఇలా చేస్తే లక్షీదేవి కటాక్షం కలుగుతుంది..

ఈ అమవాస్య చాలా విశిష్టమైనది. సోమవారం అంటే శివునికి ఇష్టమైన రోజు. అమావాస్య సోమవారం రావటాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజున శివున్ని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య శివారాధనకు చాలా విశిష్టమైనది.

amavsya

ప్రతీకాత్మక చిత్రం

డిసెంబర్ 30వ తేదీన సోమవారం రోజున అమావాస్య వచ్చింది. ఈ అమవాస్య చాలా విశిష్టమైనది. సోమవారం అంటే శివునికి ఇష్టమైన రోజు. అమావాస్య సోమవారం రావటాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజున శివున్ని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య శివారాధనకు చాలా విశిష్టమైనది. ఇంతటి పవిత్రమైన అమావాస్య రోజున కొన్ని పొరపాటులు చేస్తే జీవితంలో పేదరికం ఏర్పడుతుంది. ఈ సోమవతి అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? అనే విషయాలు తెలుసుకుందాం..

ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు శివున్ని పూజించాలి. ఈ రోజు చేసే పూజకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అమావాస్య నాడు స్త్రీలు ఉదయాన్నే మీ పూజ గదిలో శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించుకొని, దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి. ఉదయం పూజ అనంతరం తిరిగి మరల సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. ఇలా సోమవతి అమావాస్య రోజున చేయడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి  తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సోమవతి అమావాస్య రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. బీరువాపై స్వస్తిక్ గుర్తు ఉంచడం వల్ల లక్ష్మీ  కటాక్షం కలుగుతుంది.

అమావాస్య రోజున చేసే ప్రతి పనితో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు తలంటూ స్నానం చేయాలి, లేకపోతే దరిద్రానికి దారితీస్తుంది. అలాగే పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు. జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్లకూడదు. 

అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ రోజున నీటిలో కొంచెం కళ్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ప్రతికూల శక్తులన్నీ తొలిగిపోయి, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం మంచిది. గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం వల్ల మీ కుటుంబంలోని కష్టాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డు పడుతుంది. ఈ రోజున ఐదు లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి. ఇలా లవంగాల నుండి వచ్చిన పొగను ఇల్లంతా పట్టించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలిగిపోతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్