విష్ణువుకు ఇష్టమైన తులసిని తొలిఏకాదశి రోజున ఇంట్లో నాటితే అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇది జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. దేవశయని ఏకాదశి రోజు తులసి మొక్కను ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచాలి? తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
దేవశయనీ ఏకాదశి వ్రతం సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన వ్రతంగా పరిగణిస్తారు.తొలిఏకాదశికి అపారమైన మతపరమైన,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున విష్ణువు, తల్లి లక్ష్మిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దీంతో వారి జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దేవశయని ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి ఆకుల వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?
ఇంట్లో ఈ స్థలాలు చాలా ముఖ్యమైన ప్రదేశాలు:
శాస్త్రం ప్రకారం, ఇంట్లోని కొన్ని ప్రదేశాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, ఇంట్లో సానుకూల శక్తి నిండిపోతుందని చెబుతారు. అదే సమయంలో, వంటగది, దేవుని గది, ఇంటికి తూర్పు దిశ, ఇంటి అగ్ని కోణం, ప్రధాన తలుపులు చాలా ముఖ్యమైనవి.
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో తులసి ఆకులను ఉంచండి:
దేవశయని ఏకాదశి రోజున ఇంట్లోని ఈ ప్రదేశాల్లో తులసి ఆకులను ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం విష్ణుమూర్తి సంతోషిస్తాడు.మీ కుటుంబానికి విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వంటగదిలో, దేవుని గది, ఇంటి తూర్పు దిక్కు, ఇంటి అగ్ని మూలలో ప్రధాన ద్వారంలో తులసి ఆకులను ఉంచడం వల్ల లక్ష్మీ నారాయణుని అనుగ్రహం మీపైకి వస్తుంది.
ఈ ముఖ్యమైన ప్రదేశాలలో తులసి రేకులు లేదా ఆకులను ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. ఇది ఇల్లు, జీవితం నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. తులసి దేవిని తల్లి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి, వాటిని ఈ ముఖ్యమైన ప్రదేశాలలో ఉంచడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు స్థిరపడతాయి.
తులసి పూజ ప్రయోజనాలు:
మనం రోజూ తెల్లవారుజామున తులసిని పూజించి, సంధ్యా సమయంలో తులసి ముందు దీపం వెలిగిస్తే, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. దీంతో విష్ణువు కూడా సంతోషిస్తాడు. ఏకాదశి రోజున తులసిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.
ఏకాదశి నాడు తులసి ప్రాముఖ్యత:
ఏకాదశి రోజున తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒకవైపు తులసి మహావిష్ణువుకు ఇష్టమైన మొక్క. మరోవైపు ఏకాదశి వ్రతం కూడా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఏకాదశి రోజున తప్పకుండా విష్ణువు, తులసి మొక్కను పూజించాలి. ఈ రోజున విష్ణుమూర్తికి భోగం లేదా నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు, అందులో తులసి రేకులను ఉంచి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏకాదశి రోజున తులసి ఆకులను తెంపకూడదు. ఏకాదశి ముందు రోజు తులసి ఆకులను తెంపి పెట్టుకోవాలి.