Shani Trayodashi : నేడు శనిత్రయోదశి .. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..

హిందూ మతంలో శనిత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం శనివారం శనీశ్వరునికి అంకితం చేయబడింది. శనిదేవుని ఆశ్వీర్వాదం పొందిన వ్యక్తికి జీవితంలో ఏ లోటు ఉండదని, విజయం వారి పాదాల వద్దనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

SHANITRAYODASHI

ప్రతీకాత్మక చిత్రం

హిందూ మతంలో శనిత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం శనివారం శనీశ్వరునికి అంకితం చేయబడింది. శనిదేవుని ఆశ్వీర్వాదం పొందిన వ్యక్తికి జీవితంలో ఏ లోటు ఉండదని, విజయం వారి పాదాల వద్దనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు అటువంటి వారి ఇంట్లో లక్షీదేవి నివసిస్తుందని విశ్వాసం. శనిత్రయోదశి రోజు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..  

డిసెంబర్ 28వ తేదీన (శనివారం రోజున) ఈ శనిత్రయోదశి వచ్చింది. మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశిని శనిత్రయోదశి అంటారు. ఈ శనిత్రయోదశి అంటే శివునికి ఇష్టమైన తిథి. ఎందుకంటే ఆ పరమశివుడు విషాన్ని మింగి సర్వలోకాలను రక్షించాడు. దీని సందర్భంగా ముక్కోటి దేవతలు కలిసి శివుడి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసిన రోజే ఈ త్రయోదశి తిథి. కాబట్టి ఈ త్రయోదశి రోజున శివుడిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఎవరి జాతకంలో అయితే అష్టమ శని దోషాలు, ఏలినాటి దోషాలు ఉంటాయో అలాంటివారు ఈ శనిత్రయోదశి రోజున శివాలయంలో నవగ్రహాలకు తైలాభిషేకం చేసి, నువ్వులను నైవేద్యంగా సమర్పించి, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేస్తే వారి జీవితంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కొని శివున్ని దర్శించుకోవాలి.

శనిత్రయోదశి రోజు చేయకూడని పనులు:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిత్రయోదశి రోజున నూనె కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే ఇంట్లోకి దారిద్య్రం వస్తుందని చెబుతారు. శనివారం రోజున నూనె దానం చేయవచ్చు. నూనె దానం చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఆవాల నూనె, నువ్వుల నూనె దానం చేయడం మంచిది. ఈ రోజు ఉప్పును ఇంట్లోకి తీసుకురాకూడదు. అలా చేస్తే చెడు శకునంగా భావిస్తారు. శనిత్రయోదశి రోజున ఉప్పును ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఇంట్లో అప్పులు పెరిగి, అనేక వ్యాధులకు గురవుతారు.చెప్పులను కొనకూడదు. ఒకవేళ కొన్నా ఇంట్లోకి తీసుకురాకూడదు.

శనిత్రయోదశి రోజు చేయాల్సిన పనులు:

శనిత్రయోదశి రోజున బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శని ప్రభావం దూరం అవుతుందని పండితులు చెబుతున్నారు. శనీశ్వరునికి గురువు ఆంజనేయ స్వామి కావున ఆ రోజున ఆంజనేయ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అప్పులతో బాధ పడుతున్నవారు శనిత్రయోదశి రోజున ఆంజనేయ పటం ముందు నెయ్యి తీపం వెలిగిస్తే అప్పులు తీరుతాయని భక్తుల నమ్మకం. శనిత్రయోదశి రోజున రావి చెట్టులో విష్ణు నివసిస్తాడని పెద్దలు అంటుంటారు. ఈ రోజున రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విష్ణు అనుగ్రహం లభించి, సర్వపాపాలు తొలగిపోతాయి. శని వాహనం కాకి. కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం పెడితే జాతకంలో ఉన్న శనిదోషాలు పోతాయి. శనిత్రయోదశి రోజున నల్ల నువ్వులని దానం చేస్తే జాతకం ప్రకారం ఏవైనా అరిష్టాలు ఉంటే తొలగిపొయి, సర్వ శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ సమాచారం పలువురు జ్యోతిష్య పండితుల ద్వారా సేకరించినది మాత్రమే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్