||ప్రతీకాత్మక చిత్రం||
మేషం : గతంలో పెట్టిన ఖర్చుకు పర్యవసానాలు ఎదురవుతాయి. అవసరమైన డబ్బు చేతికి అందదు. ఈ రోజు సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే పిల్లలతో గడిపితే మంచిది. ప్రేమ విషయాలు మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. సమయాన్ని వృధా చేయొద్దు. ధ్యానం, యోగా చేయాలి.
వృషభం : మీ సరదా స్వభావం ఎదుటి వారిని సంతోషంగా ఉంచుతుంది. ఇంట్లో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ స్నేహితులను చాలా రోజుల తర్వాత కలవబోతున్నారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా కనిపిస్తారు. వారి నుంచి గొప్ప సర్‌ప్రైజ్ అందుకొనే చాన్స్ ఉంది.
మిథునం : ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. ప్రేమ సానుకూల పవనాలు వీస్తున్నాయి. సాయంత్రం ఖాళీ సమయంలో మీ మనస్సుకు దగ్గరైనవారి ఇంట్లో గడుపుతారు. ఇంటికి వచ్చిన అనుకోని అతిథితో సమయాన్ని గడుపుతారు.
కర్కాటకం : ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం అలసటను కలుగజేస్తుంది. ఈ రోజు మీ కుటుంబసభ్యుల భావాలను కించపర్చవద్దు. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రేమలో విచక్షణ చూపించండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం.
సింహ : సృజనాత్మకమైన పనులు కలిసివస్తాయి. రాత్రి లోపు ఆర్థిక లాభాలను పొందుతారు. ఇచ్చిన అప్పు తిరిగి మీ చేతికి వస్తుంది. మీ భాగస్వామితో కాలక్షేపం చేయండి. పార్కుకో, సినిమా హాల్‌కో వెళ్తే మీ మూడ్ రిలాక్స్ అవుతుంది. ఈ రోజు మీకు రొమాంటిక్‌గా నిలుస్తుంది.
కన్య : శ్రమతో కూడిన రోజు. కానీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో మీ భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. మీ ప్రశాంత వైఖరితో గొడవను సరి చేస్తారు. సాయంత్రం సామాజిక కార్యక్రమంలో పాల్గొంటే ఎక్కువ వినోదాన్ని పొందుతారు. మీ సంభాషణల్లో సహజంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. మీకిష్టమైన వారు మీతో మాట్లాడటం ఇష్టం లేకపోతే వారిని ఒత్తిడి చేయొద్దు.
తుల: బయటి కార్యక్రమాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ రోజు ధనాన్ని జూదంలో, బెట్టింగ్‌లో పెడితే నష్టం తప్పదు. వాటికి వీలైనంత దూరంగా ఉండండి. మీకు హాని చేయాలని చూస్తారు. చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి. లేకపోతే ఘర్షణలకు దారి తీస్తుంది. గర్ల్ ఫ్రెండ్‌తో అసభ్యంగా ప్రవర్తించవద్దు. మీ బంధుువులు మీ వైవాహిక ఆనందానికి ఇబ్బందులు తెచ్చి పెడతారు. ఆకస్మికంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
వృశ్చికం : ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కానీ, మీ తెలివి తేటలతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి. ఉపయోగకరమైన ఇంటర్నెట్ వాడకం మరిన్ని అంశాలు నేర్చుకునేలా చేస్తాయి.
ధనుస్సు : ఇంట్లో ఉండే టెన్షన్ కోపానికి దారి తీస్తుంది. శారీరక శ్రమ ద్వారా దాన్ని తగ్గించుకోండి. రియల్ ఎస్టేట్‌లో తగినంత సొమ్మును మదుపు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వివాదాలకు తావిచ్చే అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీ భాగస్వామికి అనారోగ్యం తలెత్తుతుంది. పాటలు, నృత్యం, మొక్కలు పెంచడం వంటివి సంతృప్తిని కలిగిస్తాయి.
మకరం : మీ శక్తిని తిరిగి పొందటానికి విశ్రాంతి తీసుకోండి. మీ అమ్మవారి తరఫున నుంచి ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధ కలహాలు కలిగే చాన్స్ ఉంది. ఆర్థిక విషయాల్లో, రాబడి విషయాల్లో దాపరికం లేకుండా ఉండండి. మీ ప్రేమకు మీ భాగస్వామి మైమరిచిపోతుంది. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుస్తారు. తద్వారా మంచి అనుభవాన్ని పొందుతారు.
కుంభం : మీ చెడు అలవాట్లు పెను ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తండ్రి, తండ్రి సమానులను సూచనలు అడగండి. వినయంగా ఉండండి. స్నేహితుడు మీ కన్నీళ్లు తుడుస్తారు. మీ భాగస్వామి మరోసారి మీ ప్రేమలో పడిపోతుంది. మీ మంచి లక్షణాలు ఇంట్లో చర్చకు వస్తాయి.
మీనం : మీ స్నేహితుడి ప్రవర్తన సమస్యను కలగజేస్తుంది. ఖర్చు పెట్టడంలో విచక్షణ ఉండాలి. లేకపోతే అదే ఖర్చు మళ్లీ పెట్టాల్సి రావచ్చు. మీరు సంతోషంగా ఉండేందుకు మీ ప్రియమైన వ్యక్తి మీకు పనిచేసి పెడతారు. తీరికలేని సమాయాన్ని గడుపుతారు. మంచి పుస్తకాలు మీ ఆలోచనాశక్తిని పెంచుతాయి.