||ప్రతీకాత్మక చిత్రం||
మేషం
స్నేహితులతో సమయం గడుపుతారు. స్థిరాస్తులపై పెట్టుబడి వద్దు. అది మీ ప్రాణాలకే ప్రమాదం. పాత అప్పులు తీర్చేస్తారు. ప్రేమ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెడతారు. మీ పెళ్లి ఈ రోజు మీకు జీవితంలో అత్యుత్తమ అనుభూతిని కలిగిస్తుంది.
వృషభం
ఆఫీస్ నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నించండి. ఆర్థిక లబ్ధి మెరుగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ మద్దతు దొరుకుతుంది. మాట్లాడేముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలివి, ఉపాయం, యాత్రలు, ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. సంతోషాన్ని కలిగిస్తాయి.
మిథునం
ఈ రోజు హుషారుగా ఉంటారు. శక్తివంతులై ఉంటారు. పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నీరసిస్తుంది. మీ పిల్లలు సాధించిన విజయం మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తుంది. కార్యాలయాల్లో మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్థులు మంచి లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీకు కొంచెం నష్టం కలిగించే అవకాశం ఉంది.
కర్కాటకం
ప్రతి చిన్న విషయానికి చిరాకు పడిపోతారు. బయటికి వెళ్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ధనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. శ్రీమతితో తగాదా ఏర్పడుతుంది. గత జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. అంతులేని ఆత్మికానందం పొందుతారు. కార్యాలయాల్లో మీ పనికి మెచ్చుకుంటారు.
సింహ
మానసికంగా ధృడంగా ఉంటే ఈ రోజు మీదే. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అందుకు మీ జీవిత భాగస్వామి తోడు అవసరం. మీ భార్యను నిర్లక్ష్యం చేస్తే బంధంపై ప్రభావం పడుతుంది. ఉద్యోగులకు ఈ రోజు మంచిది కాదు. మీ సహోద్యోగులు ద్రోహం చేస్తారు.
కన్య
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. ధనం ఖర్చు అవుతుంది. ఇల్లు మారితే శుభం. విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కోసం వినియోగిస్తారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. లేకపోతే దీర్ఘకాలిక బంధంపై ప్రభావం పడుతుంది.
తుల
సరదా కోసం బయటికి వెళ్తే ఆనందం పొందుతారు. ప్రయాణం ఒత్తిడిని కలిగిస్తుంది. కాకపోతే ఆర్థికంగా కలిసివస్తుంది. ప్రేమ, రొమాన్స్ మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కళలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.
వృశ్చికం
నరాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోవాలి. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అనుభవజ్ఞులను కలుస్తారు. ఇతరులకు సమయం కేటాయించటానికి మంచి రోజు. రోజంతా మీకు నవ్వులను మెరిపించే రోజు ఇది.
ధనుస్సు
ఆహారంపై జాగ్రత్త తీసుకోవాలి. మైగ్రేన్ ఉంటే భోజనం మానొద్దు. బయటికి వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కలిసివస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలు చెప్పండి. మీ ప్రేమ సంబంధ మధురానుభూతి పొందుతారు. లీగల్ విషయాల్లో లాయర్ దగ్గరికి వెళ్లడానికి మంచి రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మకరం
మీ నిక్కచ్చితనం మీ స్నేహితులకు ఇబ్బంది కలగవచ్చు. మీ డబ్బు జారిపోతున్నా, మీ అదృష్ట నక్షత్రాలు డబ్బును ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి. సాధారణ వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. మీరు హాజరుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీరు ఎదగడానికి దోహదం చేస్తాయి.
కుంభం
ఈ రోజు మంచి మూడ్‌లో ఉంటారు. డబ్బును దాచిపెట్టుకోండి. మీ ప్రవర్తన మీ కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. డేట్ వెళ్తే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. మీ కృషికి ఈ రోజు ఫలితం దక్కుతుంది. ఒప్పుకున్న పనులు పూర్తవుతాయి. ఈ రోజు ఆహారం, డ్రింక్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది జాగ్రత్త.
మీనం
మీ పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడటం వల్ల మీ వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది. వ్యాపారాభివృద్ధికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి వారి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఆఫీస్‌లో మీది పైచేయి అవుతుంది. వైవాహిక జీవితంలో చాలా అంశాలు మీకు అద్భుతంగా మారుతాయి.
