||ప్రతీకాత్మక చిత్రం||
మేషం :
పని ఒత్తిడి చిరాకు పడేలా చేస్తుంది. అప్పు తిరిగి ఇవ్వని స్నేహితులకు దూరంగా ఉండండి. మతసంబంధమైన ప్రదేశానికి వెళ్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మీ ప్రియమైనవారితో సున్నితంగా మాట్లాడండి. మీ బాస్ నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రయాణం భవిష్యత్తుకు పునాది.
మీ అదృష్ట సంఖ్య = 1, రంగు = నారింజ, బంగారు
వృషభం :
జీవితంపై మరీ సీరియస్‌గా ఉండకండి. ఈ రోజు ప్రశాంతత కలుగుతుంది. గుడ్డి ప్రేమను సాధిస్తారు. భాగస్వాములతో కొత్త వ్యాపారానికి మంచి రోజు. లాభం పొందే అవకాశం ఉంది. భాగస్వాములతో చేతుల కలిపే ముందు ఆలోచించుకోండి.
మీ అదృష్ట సంఖ్య = 1, రంగు = నారింజ, బంగారు
మిథునం :
గొడవలు పడాలన్న బుద్ధిని నియంత్రించుకోండి. లేకపోతే బంధుత్వాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఖర్చులను అదుపుచేసుకోండి. మీ విచ్చలవిడి ఖరచు, జీవన విధానం ఇంట్లో టెన్షన్లకు దారి తీస్తుంది. మీ ప్రేమ ప్రయాణం మధురమేకానీ కొన్ని రోజులే. ఈ రోజు చాలా బాగుంటుంది. బయటికి వెళ్లి ఆహ్లాదంగా గడపండి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చికాకు పెట్టినా, తను మీ కోసం ఏదో అద్భుతం చేస్తారు.
మీ అదృష్ట సంఖ్య = 8. రంగు = నలుపు, నీలం
కర్కాటకం :
అనారోగ్యం నుంచి కోలుకుంటారు. రుణాల ప్రయత్నాలు తీరుతాయి. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. కొత్త రొమాన్స్ ఏర్పడుతుంది. ప్రేమ వెల్లివిరుస్తుంది. ఆఫీస్‌లో చేసే పని లబ్ధిని చేకూర్చుతుంది.
మీ అదృష్ట సంఖ్య = 2, రంగు = వెండి, తెలుపు
సింహ :
ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. మీ ప్రియమైన వారితో అభిప్రాయభేదాలు ఈ రోజు తొలగిపోతాయి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు ఆఫీసుల్లో సమస్యలు ఎదుర్కొంటారు. తెలియకుండా తప్పులు చేస్తారు. ట్రేడ్ రంగాల వారికి సాధారణం.
మీ అదృష్ట సంఖ్య = 1. రంగు = నారింజ, బంగారు
కన్య :
గొడవలు మీ మూడ్‌ను పాడు చేస్తాయి. మీ నుంచి ఇతరులు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోండి. ఖర్చును అదుపులో పెట్టుకోండి. మీ జీవిత భాగస్వామితో మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు. నాటి అమాయకపు ఆనందాలను గుర్తు తెచ్చుకుంటారు.
మీ అదృష్ట సంఖ్య = 8, రంగు = నలుపు, నీలం
తుల :
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక లాభాలు పొందుతారు. పలు రిపేరు పనులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. మీ ప్రియమైన వ్యక్తితో సమయాన్ని గడుపుతారు. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మీ అదృష్ట సంఖ్య = 1, రంగు = నారింజ, బంగారు
వృశ్చికం :
ఆర్థిక లాభం పొందుతారు. పిల్లల విజయాలు మీకు కలిసి వస్తాయి. మీ ప్రియమైనవారితో కలిసి చాక్లెట్‌ను రుచి చూస్తారు. ఈ రోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది. కానీ ఆ సమయాన్ని కార్యాలయ పనులకు వినియోగిస్తారు.
మీ అదృష్ట సంఖ్య = 3, రంగు = కాషాయం, పసుపు
ధనుస్సు :
మానసిక పరిణితి శక్తివంతం అవుతుంది. ఎలాంటి పరిస్థితినైనా ఆధీనంలో ఉంచుకోగలుగుతారు. సురక్షితమైన చోట పెట్టుబడి పెడితే అధిక లాభాలు తెచ్చిపెడుతుంది. గ్రహరీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనిపిస్తోంది. వ్యాపార ప్రణాళిక దీర్ఘకాలంలో ఫలితం చూపిస్తుంది. ఈ రోజు బాగా గడుస్తుంది.
మీ అదృష్ట సంఖ్య = 9, రంగు = ఎరుపు
మకరం :
ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లను తప్పిస్తుంది. ప్రేమ సానుకూల పవనాలు వీస్తోంది. అనుకున్న ఫలితాలు రాలేదని నిరాశ పడకండి, సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకుంటే విజయం మీదే.
మీ అదృష్ట సంఖ్య = 9, రంగు = ఎరుపు
కుంభం :
మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఆర్థిక స్థితి అంతగా అనుకూలించదు. ధనాన్ని పొదుపు చేయలేరు. మీకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తులను నమ్మే ముందు అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే చోట గొప్ప విజయాన్ని సాధిస్తారు.
మీ అదృష్ట సంఖ్య = 7, రంగు = లేత పసుపు, తెలుపు
మీనం :
ఇంటి కోసం మదుపు చేయడం లాభదాయకం. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. భాగస్వామ్య అవకాశాలు బాగుంటాయి. వివాహం ఇంత అద్భుతంగా ఉందని గతంలో మీకు తోచలేదని ఈరోజు తెలుసుకుంటారు.
మీ అదృష్ట సంఖ్య = 5, రంగు ఆకుపచ్చ, త్సామనము