||తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం||
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. 24 మందితో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. శుక్రవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 24 మంది సభ్యులను ప్రకటించారు. పాలక మండలిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురికి చోటు దక్కింది. కాగా, తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. జీ సీతారెడ్డి (ఎంపీ రంజిత్ రెడ్డి భార్య), శరత్ చంద్రారెడ్డికి పాలక మండలిలో చోటు కల్పించారు.
వీరే సభ్యులు:
పొన్నాడ సతీశ్ (ముమ్మిడివరం), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), తిప్పేస్వామి (మడకశిర), యానాదయ్య (కడప), అశ్వర్థనాయక్ (అనంతపురం), మేకా శేషుభాబు, వెంకట సుబ్బారెడ్డి, సీతారామిరెడ్డి (మంత్రాలయం), వెంకట సుబ్బరాజు, శరత్ చంద్రారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, జీ సీతారెడ్డి, శిద్దా సుధీర్ (ప్రకాశం), బాల సుబ్రమణియన్, కృష్ణమూర్తి, సుదర్శన్ వేణు, నాగసత్యం (ఏలూరు), ఎస్.శంకర్, దేశ్‌పాండే (కర్ణాటక), కేతన్ దేవాయ్, అమోల్ కాలే, సౌరబ్ బోరా, మిలింద్ నర్వేకర్, రామ్ రెడ్డి సాముల.