Kubera: కుబేరుడు మీపై కోపంగా ఉంటే ఇలా జరుగుతుందట

ఐశ్వర్యానికి అధిపతి అయిన ధన కుబేరుడు మీపై కోపంగా ఉంటే మీరు ఎంత ధనవంతులైనా దరిద్రుడు అవ్వడం ఖాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుబేరుడు మీపై కోపంగా ఉంటే మీరు ఏ సూచనలు ఉంటాయో చూద్దాం.

Kubera

ప్రతీకాత్మక చిత్రం 

హిందూమతంలో లక్ష్మీదేవికి, కుబేరునికి ఐశ్వర్య దేవతగా ప్రత్యేక స్థానం కల్పించారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడిని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు లక్ష్మీ దేవితో పాటుగా కుబేరుడిని పూజించాలి. ఈ పూజ మీ ఆర్థిక సమస్యలను తొలగించడంతో పాటు సంపదను పొందేలా చేస్తుంది. లక్ష్మీదేవి,కుబేరుని ఆగ్రహిస్తే..ఎంతటి కోటీశ్వరుడైనా బిచ్చగాడిగా మారుతాడు. కుబేరుడు మీ పై కోపంగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి అరిష్ట సంకేతాలు వస్తాయి? తెలుసుకుందాం. 

విలువైన వస్తువుల నష్టం:

శాస్త్రం ప్రకారం, విలువైన వస్తువులు ఎవరైనా పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా, కుబేరుడు మీ పట్ల సంతోషించలేడని అర్థం. కుబేరుడు నీపై కోపంగా ఉన్నాడని ఇది సూచిస్తుంది.కుబేరుని ప్రసన్నం చేసుకోవడానికి మీరు అతనిని భక్తితో పూజించాలి. 

ఇంట్లో అద్దాలు పగలడం:

మీ ఇంట్లో అద్దాటు పగిలిపోతుంటే ధనకుబేరుడి ఆశీస్సులు మీపై ఉండవని మీరు అర్థం చేసుకోవాలి. అంటే కుబేరుడు నీపై కోపంగా ఉన్నాడని అర్థం. ముఖ్యంగా గాజుసామాను ఎంత జాగ్రత్తగా ఉంచినా అది పడి పగిలిపోతే అశుభం.

సాలెగూడు:

లక్ష్మి దేవి, కుబేరుడు మీ ఇంట్లో ఉంటే..ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మీ ఇంటిని ఎంత శుభ్రం చేసినా, సాలెపురుగుల చక్రాలు కనిపిస్తే, కుబేరుడు మీపై కోపంగా ఉన్నాడని అర్థం. స్పైడర్ వెబ్లను ఉన్న ఇళ్లలో లక్ష్మీ దేవితో ఆనందం, శ్రేయస్సు ఉండవు.

పదే పదే డబ్బులు పోగొట్టుకోవడం: 

ఒక వ్యక్తి  పదే పదే డబ్బులు పోగొట్టుకుంటుంటే కుబేరుడు కోపంగా ఉన్నాడని అర్థం. పదే పదే డబ్బు పోగొట్టుకోవడం చెడు సమయాన్ని సూచిస్తుంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్