vastu tips: దేవుడి గదిలో బల్లి కనిపిస్తే మీ జీవితంలో జరిగేది ఇదే

బల్లిని చూడటం కొన్నిసార్లు శుభం, కొన్నిసార్లు అశుభంగా భావిస్తారు. దేవుని గదిలో, వంటగదిలో బల్లులు కనిపిస్తే దాని అర్థం ఏమిటి?

Lizard In House

ప్రతీకాత్మక చిత్రం 

బల్లి శ్రేయస్సు, సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి  దూతలుగా పరిగణిస్తారు. ఇంట్లో బల్లిని చూడటం శుభ సంకేతం. ఇది ఆర్థిక లాభం, విజయానికి ఒక రూపంగా పనిచేస్తుంది. ఇది విజ్ఞానం, అభివృద్ధికి చిహ్నంగా కూడా పేర్కొన్నారు. బల్లులు తరచుగా ఎత్తైన ప్రదేశాలలో నివసిస్తాయి కాబట్టి, ఇది ఆధ్యాత్మిక ఔన్నత్యానికి చిహ్నం. కానీ, కొన్ని నమ్మకాల ప్రకారం, బల్లి ప్రతికూలత, దుష్ట ఆత్మలకు రూపకం. దీనితో పాటు ఇంట్లో బల్లి చనిపోతే అశుభంగా భావిస్తారు. అదృష్టానికి, వివేకానికి, భద్రతకు ప్రతీక అయిన బల్లిని చూడటం ఎప్పుడు శుభప్రదం? ఎప్పుడు చూడటం అశుభం?

బల్లికి సంబంధించిన శుభ, అశుభ సూచనలు:

1. దేవుని గదిలో ప్రతిరోజూ బల్లి కనిపిస్తే, త్వరలో మీకు శుభవార్త అందుతుందని అర్థం.

2. వంటగదిలో లేదా దేవుని గదిలో బల్లి కనిపిస్తే అది మరింత శుభప్రదంగా పరిగణిస్తారు. వంటగదిలో బల్లిని చూడటం మంచిదని భావిస్తారు. ఇది శుభప్రదం, మీరు ఆర్థిక లాభ అవకాశాలను కూడా పొందుతారని సంకేతం.

3. మీరు నలుపు రంగు బల్లిని చూసినట్లయితే అది అలక్ష్మి దేవి యొక్క చిహ్నంగా భావించాలి. 

4.హిందూ విశ్వాసాల ప్రకారం, దేవుని గదిలో చనిపోయిన బల్లి కనిపించడం అశుభ సంకేతం. కానీ, మీరు ఉదయాన్నే బల్లిని చూస్తే, అది పురోగతి,లాభానికి చిహ్నంగా పరిగణిస్తారు. 

5.దేవుడి గది లేదా గుడి నేలపై బల్లి కదులుతుంటే  మీకు ఆర్థిక లాభం చేకూరుతుందని అర్థం. అయితే, మీరు ఆలయ నేలపై చనిపోయిన బల్లిని చూస్తే, మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచిస్తుంది.

6. పూజ సమయంలో మీ మీద బల్లి ఎక్కినా లేదా మీ శరీరంపై పడినా, మీ కోరిక చాలా త్వరగా నెరవేరుతుందని నమ్ముతారు.

7. దీపావళి లేదా మరేదైనా పెద్ద పండుగ సమయంలో ఇంటి దేవుడి గదిలో అకస్మాత్తుగా బల్లి కనిపించినట్లయితే అది శుభప్రదంగా పరిగణిస్తారు. గాయపడిన బల్లి ఇంట్లో కనిపిస్తే, అది అశుభ సంకేతం. ఇది ఇంట్లో కలహాలు, బాధలను పెంచుతుంది.

8. ఇంట్లో బల్లిని చూడటం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా దేవుడి గదిలో, వంటింట్లో బల్లి కనిపిస్తే చాలు. బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. వంటగదిలో లేదా దేవుడి గదిలో బల్లి కనిపిస్తే, అది ధనలాభం, శుభవార్తకు సంకేతం.శుక్రవారం రోజు బల్లిని చూడటం మరింత శుభప్రదం. దీపావళి రోజున బల్లిని చూడటం చాలా అశుభం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్