తాబేలు అనేది శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. సముద్ర మదనంలో తాబేలు రూపంలో కూర్మ మూర్తిగా మహావిష్ణువు అవతారం ఎత్తాడు. సముద్రంలో మంధన పర్వతం మునిగిపోకుండా కూర్మ మూర్తి తన మోపును ఆధారంగా నిలిపాడు.
ప్రతీకాత్మక చిత్రం
భూమిపై కొన్ని జంతువులు, పక్షులు వివిధ జంతువులు బొమ్మలు వాస్తు రీత్యా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ జీవులు అదృష్టానికి సంకేతాలుగా చెబుతుంటారు. అటువంటి ముఖ్యమైన జీవి తాబేలు. తాబేలు అనేది శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. సముద్ర మదనంలో తాబేలు రూపంలో కూర్మ మూర్తిగా మహావిష్ణువు అవతారం ఎత్తాడు. సముద్రంలో మంధన పర్వతం మునిగిపోకుండా కూర్మ మూర్తి తన మోపును ఆధారంగా నిలిపాడు. సాగరమథనంలో మహాలక్ష్మి అవతరించింది. ఆ మహాలక్ష్మిని శ్రీమహావిష్ణువు వివాహం చేసుకున్నాడు. అందుకే కూర్మ స్వరూపంగా భావించిన విష్ణుమూర్తిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. చాలా మంది తాబేళ్ల బొమ్మలను ఇంట్లో ఉంచుకుంటారు. కొంతమంది తమ ఇళ్లలో తాబేలు యంత్రాన్ని స్థాపిస్తారు. సనాతన సాంప్రదాయం ప్రకారం, తాబేలు యంత్రాన్ని లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు శాస్త్రంలో, తాబేలు గురించి అనేక విశిష్టతలు చెప్పుకొచ్చారు. తాబేలు జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తుంది. తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తాబేలు ఉంగరం
వాస్తు ప్రకారం, తాబేలు ఉంగరం ధరించడం అత్యంత శుభప్రదం. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం, అక్షయ తృతీయ, దీపావళి లేదా ధనత్రయోదశి తాబేలు ఉంగరాన్ని ధరించడానికి చాలా అనుకూలమైన రోజులు. తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా, వ్యక్తి ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతాడు.
మెటల్ తాబేలు
మెటల్ తాబేలు ప్రాముఖ్యతను ఫెంగ్ షుయ్‌లో కూడా ప్రస్తావించారు. చాలా మంది లోహపు తాబేళ్లను ఇంట్లో ఉంచుకుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో ఉత్తర దిశలో లోహపు తాబేలును ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు ఏదైనా కోరికను తీర్చుకోవాలనుకుంటే, ఎరుపు పెన్నుతో మీ కోరికను ఖాళీ కాగితంపై రాయండి. దీని తర్వాత ఈ కాగితాన్ని తాబేలు లోపల ఉంచి ఉత్తర దిశలో ఉంచండి. ఈ పరిహారం మనస్సు కోరికలను త్వరగా నెరవేరుస్తుందని నమ్ముతారు.
తాబేలు చిత్ర పటం
ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాబేలు బొమ్మను ఉంచడం కూడా శుభప్రదం. ఈ పరిష్కారం వ్యాపారంలో లాభాలను తెస్తుంది. దీనితో పాటు నెగెటివ్ ఎనర్జీ ఇంటికి దూరంగా ఉండి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. అలాగే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
తాబేలు యంత్రం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. ఇది ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. శుక్రవారం లేదా పౌర్ణమి రోజున ఇంట్లో కసవ్ యంత్రాన్ని ప్రతిష్టించడం శ్రేయస్కరం. ఇది కాకుండా మీరు దీన్ని ఏ శుభ సమయంలోనైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.