Sleeping Habits | ఎలా నిద్రించాలి.. వేదాలు చెప్పిన శయన నియమాలివీ..

పురాణాలు, శాస్త్రాలు, వేదాలు.. నిద్ర గురించి ఏం చెప్పాయి? ఏ దిక్కున పడుకుంటే మంచిది? ఏ ప్రదేశంలో పడుకుంటే మంచిది? ఏ చోట పడుకోకూడదు? ఏ సమయంలో నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిది? తదితర నియమాలను మన పెద్దలు కూలంకషంగా వివరించారు.

sleeping habits
ప్రతీకాత్మక చిత్రం Photo: Facebook

Sleeping Habits: అలసట వస్తే కాసేపు కునుకు తీస్తే హాయి. శరీరానికి ఒక విశ్రాంతి స్థితి. అయితే కొందరు పరిమితికి మించి సమయం పాటు నిద్రపోతారు. మరికొందరు తక్కువ సమయమే నిద్రపోతారు. అయితే, పురాణాలు, శాస్త్రాలు, వేదాలు.. నిద్ర గురించి ఏం చెప్పాయి? ఏ దిక్కున పడుకుంటే మంచిది? ఏ ప్రదేశంలో పడుకుంటే మంచిది? ఏ చోట పడుకోకూడదు? ఏ సమయంలో నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిది? తదితర నియమాలను మన పెద్దలు కూలంకషంగా వివరించారు.

శయన నియమాలు ఇవీ..

- నిర్మానుష్యంగా ఉన్న ఇంటిలో ఒంటరిగా పడుకోవద్దు. గుడి, శ్మశానవాటికలోనూ నిద్రించరాదు. 

- పడుకొని ఉన్నవారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు (విష్ణు స్మృతి)

- విద్యార్థి, పనివాళ్లు, ద్వారపాలకుడు అధిక సమయం నిద్రపోతే మేల్కొల్పవచ్చు చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించాడు.

- ఆరోగ్యవంతులు ఆయుర్దాయం కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి అని దేవీ భాగవతం సూచిస్తుంది.

- పూర్తిగా చీకటి ఉన్న గదిలో నిద్రించవద్దు అని పద్మ పురాణము చెప్పింది. 

- కాళ్లు తడిగా ఉన్నప్పుడు పడుకోవద్దు. అలా చేస్తే అప్పులు పెరుగుతాయి. పొడి పాదాలతోనే నిద్రించాలి. దాంతో లక్ష్మీధనం ప్రాప్తిస్తుంది. దీనిగురించి అత్రి స్మృతి వివరించింది.

- విరిగిన బెడ్‌పై, ఎంగిలి ముఖంతో పడుకోవటం నిషిద్ధమని మహభారతం సూచించింది.

- తూర్పుముఖంగా తలపెట్టి పడుకుంటే విద్య ప్రాప్తిస్తుంది. పశ్చిమ వైపు తల పెట్టి నిద్రిస్తే స్థల చింత ఏర్పడుతుంది. ఉత్తరం దిక్కున తల పెట్టి నిద్రిస్తే శత్రు హాని కలుగుతుంది, మృత్యు ప్రమాదం. దక్షిణం వైపు తల పెట్టి నిద్రించినచో ధనం, ఆయువు ప్రాప్తిస్తుంది.

వెబ్ స్టోరీస్