ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువులను ఉంచకూడదు

ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఈ విషయాలను చాలా మందికి తెలిసినా వాటిని అలానే ఉంచుతారు. దాన్ని వల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువ.

negative things in front of home

ప్రతీకాత్మక చిత్రం

ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఈ విషయాలను చాలా మందికి తెలిసినా వాటిని అలానే ఉంచుతారు. దాన్ని వల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువ. ఈ పొరపాట్లు చేసిన తర్వాత ఎన్ని పూజలు చేసినా మీ జీవితంలో ఎటువంటి మార్పు కలుగదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏం ఏం ఉంచకూడదంటే.. వాస్తు శాస్త్రంలో మన ఇంటి లోపల సానుకూల శక్తి ప్రభావాన్ని ఎలా పెంచాలి అనే విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. వాటిని సరైన దిశలో ఉంచకపోతే ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. దాని వల్ల ఇంటి ఆర్థిక స్థితి కూడా ప్రభావితం అవుతుంది. వాటిని సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఆనదం కలుగుతుంది.

వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం అనేది అన్ని రకాల ఆనందం, శ్రేయస్సు, వైభవానికి, లక్ష్మీ కటాక్షానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఒకవేళ దీని దిశ గనుక తప్పుగా ఉంటే, ప్రతికూలతను కలుగజేసే ఏదైనా వస్తువును సింహ ద్వారం వద్ద ఉంచినట్లయితే.. అది ఆ ఇంట్లో ఇబ్బందులకు దారి తీస్తుంది. అందుకే వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉండనివి అనేకం ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితిలోనూ ఇంటి  ముందు ఉంచకూడదు. వాటి వల్ల ఆ కుటుంబంలోని వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. చికాకులు, గొడవలే జరుగుతుంటాయి.

ఇంటి ముందు ఉండకూడని వస్తువులు ఇవే..

మురికి నీరు, ముళ్లు ఉండే మొక్కలు, చెత్త డబ్బాలు, విద్యుత్తు స్తంభం, గొయ్యి, గుడి, చెప్పులు, పెద్ద పెద్ద చెట్లు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్