మనం నిత్యం వాడే ఈ పువ్వులు పూజకు అస్సలు వాడకూడదట.. ఆ పూలు ఏవో తెలుసా..

భక్తి శ్రద్దలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పువ్వులు సమర్పిస్తారు. పువ్వులు లేని పూజ అసంపూర్ణం. మనం పూజ చేసేటప్పుడు కొన్ని పువ్వులను అస్సలు వాడకూడదట.

flowers for god

ప్రతీకాత్మక చిత్రం 

భక్తి శ్రద్దలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పువ్వులు సమర్పిస్తారు. పువ్వులు లేని పూజ అసంపూర్ణం. మనం పూజ చేసేటప్పుడు కొన్ని పువ్వులను అస్సలు వాడకూడదట. కొన్ని రకాల పవ్వులు పూజకి పనికిరావని ఆధ్యాత్మిక వేత్తలు చప్తున్నారు. పూజకి పనికి రాని పువ్వులతో పూజ చేయటం మీ ఇంటికి కీడు కలిగిస్తుందట. కాబట్టి ఎలాంటి పువ్వులతో పూజ చేయాలి? ఎలాంటి పువ్వులు పూజకు వాడకూడదు? అనే విషయాలు తెలుసుకుందాం.

బంతి పువ్వులను ఇంట్లో శుభకార్యాలకు ఇంటిని అందంగా అలంకరించడానికి వాడుతుంటాం. కానీ దేవుని పూజలో మాత్రం బంతి పువ్వులను ఉపయోగించకూడదు.

శివునికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించకూడదు. అలా సమర్పిస్తే మీరు చేసిన పూజకు పుణ్యం లభించదు. పూజకు వాడే పూలను నీటిలో కడగకూడదు.

పూజకు ఉపయోగించే పువ్వులు కింద పడితే తిరిగి మరలా వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పువ్వులను కూడా పూజలో వాడకూడదు.

పక్కింటి వారి పవ్వులతో పూజ చేస్తే మీకు రావాల్సిన పుణ్యంలో సగం వారికే చెందుతుంది.

దేవుని పూజలో విడి పూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది.

మొగలి పువ్వలతో పూజ చేయకూడదు.

గన్నేరు పూలతో శివునికి పూజిస్తే వెయ్యిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది.

వినాయకునికి మందార పువ్వులతో పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి.

సన్నజాజి పూలతో దేవునికి పూజ  చేస్తే వివాహ యోగం కలుగుతుంది.

శంఖు పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్