2025లో అనేక గ్రహాలు మారనన్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల అనేక రాశులకు మంచి యోగాలు కలగనున్నాయి. కొన్ని రాశులకు దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాశులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతకాలం ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
2025లో అనేక గ్రహాలు మారనన్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల అనేక రాశులకు మంచి యోగాలు కలగనున్నాయి. కొన్ని రాశులకు దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాశులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతకాలం ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..
2025లో వృషభ రాశివారికి విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా హుషారుగా ఉంటారు. కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది. విదేశీ యోగం కలుగుతుంది. వృషభ రాశి వారు ఎవరైతే పెళ్లికాకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది.
సింహరాశి వారికి 2025వ సంవత్సరంలో పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు కలుగుతాయి. విదేశీ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా బాగా ఉంటారు. ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా మీ అదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులరాశి వారికి 2025వ సంవత్సరం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఏదైన కొత్త పనిని మొదలుపెడితే అందులో గొప్ప విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.
మిథున రాశి వారికి రానున్న 2025వ సంవత్సరంలో చాలా బాగుంది. వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి.
2025వ సంవత్సరంలో మేష రాశి వారికి ధనలాభము, వస్తులాభాము, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆదాయం బాగా ఉంటుంది. డబ్బు విషయంలో మీకు అదృష్టం వరిస్తుంది. చుట్టూ పక్కన ఉన్న వాళ్లే మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆనారోగ్య సమస్యలు ఎదురయ్యే సంకేతాలు ఉన్నాయి.
కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. జీవితంలో తెలియని వెలితి ఉంటుంది. తరచూ ఆరోగ్యం మందగిస్తుంది. దంపతుల మధ్య కలహాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. గృహనిర్మాణాలు చేపడుతారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.
కన్యరాశి వారికి కుడా వచ్చే సంవత్సరంలో విపరీతమైన అదృష్టం రాబోతుంది. డబ్బు విషయంలో ధనలాభం కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మూడు నెలలు అదృష్ట నెలలుగా రాబోతున్నాయి. నిరోద్యగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎవరినీ తేలికగా నమ్మకూడదు. మా చుట్టూ ఉండే స్నేహితులే మిమ్మల్ని నమిస్తూ మోసం చేస్తారు.
2025వ సంవత్సరంలో జాతకం ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారుచాలా అదృష్టవంతులు. అన్ని రాశుల కంటే కుంభరాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. గృహయోగం, ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఉంది. మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో చాలా బాగుంటుంది. మీ ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తొలిగిపోతాయి. కుటుంబ ఐక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్ధతు లబిస్తుంది. వివాహిత జీవితంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపు అవుతాయి.
ధనస్సు రాశి వారికి వచ్చే సంవత్సరం బలహీనమైన ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకూలమైన పనులను చేయగలరు. మంచి సంపద లభిస్తుంది. ఆర్థక వ్యవహారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆదాయ వనరుల్లో పెరుగుదల ఉంటుంది. ప్రేమ, వివాహం వంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి వారికి 2025వ సంవత్సరంలో గత సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలను మీరు పరిష్కరించవచ్చు. అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్ధుమణుగుతాయి.
మీనరాశి వారు 2025వ సంవత్సరంలో సోమరితనంగా ఉంటారు. మీరు మీ పని సంబంధిత వ్యాపారాన్ని కొంత అజాగ్రత్తతో నిర్వహించవచ్చు. మీరు శ్రద్దగా, నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు.