మనం కొన్ని పనులు చేస్తుంటాం.. అవి మంచివో, చెడ్డవో అన్న విషయం తెలియదు. అయితే, పురాణాలు చెప్పినదాని ప్రకారం.. కొన్ని పనులు అస్సలు చేయకూడదు.
ప్రతీకాత్మక చిత్రం
మనం కొన్ని పనులు చేస్తుంటాం.. అవి మంచివో, చెడ్డవో అన్న విషయం తెలియదు. అయితే, పురాణాలు చెప్పినదాని ప్రకారం.. కొన్ని పనులు అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు, ఇంట్లో మంచి వాతావరణం ఉండేందుకు, దాంపత్య జీవితం సాఫీగా సాగేందుకు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే..
* భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు.
* చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు.
* చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్లడం మంచిది కాదు.
* బట్టలను, ఇంటిని శుభ్రం చేసిన నీరు ఎట్టి పరిస్థితులలోనూ శరీరంపై పడకూడదు.
* మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు.
* లక్ష్మీదేవి స్వరూపంగా భావించే.. గడపపై కూర్చోకూడదు. ముఖ్యంగా స్త్రీలు గడపపై కూర్చోరాదు.
* పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు.
* స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను వేసుకోకూడదు.
* స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు వంటివి తీయకూడదు.
* నేల మీద పడిన ఆహారాన్ని కాలితో తొక్కకూడదు.
* నుదుట కుంకుమ లేకుండా పూజ చేయకూడదు.
* సాయంకాలం వేళలో ఇంట్లో లైట్స్ వేశాక చీపురుతో ఇల్లు ఊడవకూడదు.
* ఇల్లు ఊడ్చిన చీపురు నిలబెట్టకూడదు.
* సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ పడుకోకూడదు.
* సాయంత్రం వేళలో భర్యాభర్తలు శృంగారంలో పాల్గొనకూడదు.
* పాడయిపోయిన చెప్పులను ఇంట్లో ఉంచరాదు.
* పగిలిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు.
* భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు.
