Dussera Holiday | తెలంగాణలో దసరా సెలవు మార్పు.. 24న కాదు 23వ తేదీనే పండుగ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| తెలంగాణలో దసరా సెలవు||

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవును మార్చింది. ముందుగా ఈ నెల 24వ తేదీన పండుగ సెలవును ప్రకటించిన ప్రభుత్వం, 23వ తేదీకి సెలవును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. 24వ తేదీన కూడా సెలవును ప్రకటించింది. దసరా పండుగ విషయంలో సందిగ్ధత నెలకొనడంతో తెలంగాణ విద్వత్సభ పండుగ విషయంపై పండితులతో చర్చించింది. 23వ తేదీనే దశమి వస్తుండటంతో ఆ రోజే నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజయ దశమి సెలవును 23వ తేదీకి మార్చింది. ఇంతకుముందు ప్రకటించిన 24వ తేదీని కూడా సెలవుగా కొనసాగించింది.

మరోవైపు, పాఠశాల విద్యార్థులకు పండుగ నేపథ్యంలో 13 రోజులు సెలవులు ఇవ్వగా, జూనియర్‌ కాలేజీలకు 7 రోజులు సెలవులు ఇచ్చారు. తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకారం జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు ఉంటాయి. తిరిగి 26వ తేదీన కాలేజీలు తెరుచుకుంటాయి. సెలవుల్లో కాలేజీలకుప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ఇంటర్‌ బోర్డు అన్ని కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్