తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటనలో మార్పులు.. బుధవారం అంజన్న దర్శనం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటనలో మార్పులు||

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటనలో మార్పులు జరిగాయి. 14వ తేదీ (మంగళవారం)కి బదులు, బుధవారం (15వ తేదీన) అంజన్నను సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. కొండగట్టు ఆలయానికి 100 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసింది అయితే తెలంగాణలోనే కొండగట్టు ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయంగా రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొండగట్టు లోని కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయం మొత్తం 40 ఎకరాల్లో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి పరిసర ప్రాంతాలు పర్యటన చేయనున్నారు.  ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుండి కొండగట్టు ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంగా జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


కొండగట్టు ఆలయ పర్యటనకు షెడ్యూల్ ఇవే..

ఉదయం 9గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9.05 కి బేగంపేట్ ఎయిర్పోర్టుకు వెళ్తారు. 

9.10 బేగంపేట నుండి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు ఆలయానికి 9.40 నిమిషాలకు చేరుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులకు అధికారులతో సమీక్షించనున్నారు. 

అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు  కొండగట్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 1.30కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 

1.35 బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన 1.40 ప్రగతి భవన్ చేరుకోనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్