శుక్రవారం ఈ పని చేస్తే.. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది

శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరి ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. శుక్రవారం ఎలాంటి పనిచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

MONEY TIPS

ప్రతీకాత్మక చిత్రం 

వారంలో శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయని చాలా మంది నమ్ముతుంటారు. శుక్రవారానికి  సంబంధించిన నియమాల ప్రకారం సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి అన్ని కార్యాలలో విజయం సాధిస్తాడు. శుక్రవారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ధన సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. సంపద  అనుగ్రహం పొందడానికి మనం ఎలాంటి కార్యం చేయాలో తెలుసుకుందాం. 

తమలపాకులతో: 

ఏ శుభకార్యమైనా సరే అందులో తమలపాకులను తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. పూజకు ఉపయోగించే తమలపాకునే లక్ష్మీపూజలో కూడా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

పసుపు : 

పసుపులేని శుభకార్యాలు ఉండవు. ఇది మతపరమైన దృక్కోణం నుండి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పసుపు గుడ్డలో పసుపు కొమ్మును కట్టి, భద్రంగా ఉంచితే, అది మీ జీవితంలో ఆనందం,శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతారు. మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

రావి ఆకు: 

డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి, రావి ఆకుపై ఎరుపు రంగు కుంకుమతో ``ఓం'' అని రాయండి. దీని తర్వాత ఆకును సురక్షితమైన స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. 

అశోకచెట్టు: 

మత విశ్వాసాల ప్రకారం, అశోక చెట్టును పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. చెట్టుకు వేరును తీసుకుని దానికి పూజలు చేసి, ఆపై మీ డబ్బు నిల్వ చేసే ప్రాంతంలో లేదా సురక్షితమైన స్థలంలో వేర్లు ఉంచండి. దీంతో ధన ప్రవాహం పెరుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్