స్వస్తిక్ గుర్తు ఇంట్లో ఉంచుకోవటం అత్యంత శుభప్రదం.. ఏయే ప్రదేశాల్లో ఉండాలంటే..

స్వస్తిక్ అనేది చాలా శక్తివంతమైనది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు.

 SWASTIK IN HOME

ప్రతీకాత్మక చిత్రం

స్వస్తిక్ అనేది చాలా శక్తివంతమైనది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుడి గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు హ్నంగానూ వుండేదట. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా ఉండాలని. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. బ్రహ్మదేవునితో పాటు స్వస్తిక్ గుర్తు పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి.

మొట్టమొదట మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తిక్ గుర్తు ఉండాలి. కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయవచ్చు. దీనివల్ల వాస్తు దోశాలు అన్ని పోతాయి. అలాగే ఇంట్లో ఉన్న తలుపుల మీద కూడా స్వస్తిక్ గుర్తు ఉన్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంటి మధ్యలో ఉన్న గోడలపై స్వస్తిక్ గుర్తు ఉంచినా మీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ధనం దాచుకునే ప్రదేశంలో అంటే బీరువా, అల్మారా, డ్రాలు వంటిపైనా స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ధనం చక్కగా నిలబడుతుంది. పూజ మందిరంలో కుడా స్వస్తిక్ గుర్తు పెట్టుకుంటే మంచిది. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఎక్కడయితే ఉంటుందో  స్టవ్పైన గోడ మీద స్వస్తిక్ గుర్తు కుంకుమతో వేస్తే స్థిర లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది. ధనానికి గానీ, ధన్యానికి కానీ ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి ఇలా ప్రత్యేకమైన చోట్ల స్వస్తిక్ గుర్తు ఉంచితే మంచిది. ఆగ్నేయంలో అగ్ని దేవుడు ఉంటాడు. లక్ష్మీ దేవి ఎప్పుడు అగ్ని దేవునితో ఇంటికి వస్తుంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన అక్షరం శ్రీ. అందుకనే ఇంట్లో ఆగ్నేయంలో శ్రీ అనే అక్షరం రాయాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్