Money plant:మనీ ప్లాంట్‌ని దొంగిలించి నాటాలా వద్దా? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది

ప్రజలు తమ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద పెరుగుదల కోసం మనీ ప్లాంట్‌ను నాటుతారు. అయితే మనీ ప్లాంట్‌ను దొంగిలించి నాటితే ఎక్కువ ఫలిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే వాస్తు శాస్త్రం దాని గురించి ఏమి చెబుతుంది తెలుసుకుందాం.

vastu TIPS

ప్రతీకాత్మక చిత్రం 

వాస్తు శాస్త్రం ఆధారంగా ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో దీన్ని ప్రతిష్టించడం వల్ల ఆనందం, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయని విశ్వసిస్తుంటారు. మనీ ప్లాంట్‌తో పాటు, తులసి,  శమీ వంటి అనేక మొక్కలు ..వీటిని నాటినప్పుడు, ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించి సంపదను తెస్తుందని నమ్ముతుంటారు. ఈ మొక్కలను కొనుగోలు చేసి ఇంట్లో  నాటుతాం కానీ, మనీ ప్లాంట్ మాత్రం దొంగతనం చేసి నాటాలి అనే నమ్మకం ప్రజల్లో ఉంది.

మనీ ప్లాంట్‌ను దొంగిలించి ఇంట్లో పెడితే పుణ్యఫలం లభిస్తుందని చాలా కాలంగా ప్రజల్లో ఉన్న నమ్మకం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో వాస్తు శాస్త్రంలో ఏం చెబుతుందో తెలుసుకుందాం. ఇంట్లో మనీ ప్లాంట్ నాటడానికి ఎలాంటి నియమాలు పాటించాలి. దాని గురించి వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

మనీ ప్లాంట్‌ను దొంగిలించాలా వద్దా: మనీ ప్లాంట్‌ను ఎక్కడి నుండైనా దొంగిలించి ఇంట్లో నాటితే పుణ్యఫలం లభిస్తుందని ప్రజల్లో చాలా కాలంగా మత విశ్వాసం ఉంది. మనీ ప్లాంట్ కొమ్మను వేరే వారి ఇంటి నుంచి తీసుకెళ్లి మీ ఇంటికి తీసుకువస్తే ఎవరూ చూడలేని విధంగా తీసుకురావాలనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇంటికి వచ్చిన తరువాత, దానిని ఒక కుండలో నాటాలి. 

కానీ ఈ నమ్మకం పూర్తిగా తప్పు, ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను దొంగిలించి నాటకూడదు. ఎందుకంటే ఇది సానుకూల ప్రభావాన్ని చూపే బదులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దొంగిలించబడిన దానిని తీసుకురావడం వలన సంపద పెరగడానికి బదులుగా సంపదను కోల్పోవచ్చు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను దొంగిలించి ఇంట్లో నాటకూడదు.

కొనడం లేదా బహుమతిగా తీసుకోవడం శుభప్రదం: వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ కొని ఇంట్లో నాటడం వల్ల సంపద పెరుగుతుంది. ఇది కాకుండా, ఎవరైనా మీకు మనీ ప్లాంట్‌ను బహుమతిగా ఇస్తే, అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో దాని స్థానానికి సంబంధించినంతవరకు, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో అమర్చాలి. ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్