సోమనాథ్ ఆలయం ..గుజరాత్ పశ్చిమ తీరంలో ఉంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ సోమనాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం మనదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. శివారాధకులు సోమనాథ్ ఆలయాన్ని అత్యంత గౌరవంగా భావిస్తారు. సోమనాథ్ ఆలయం గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
సోమనాథ్ ఆలయం ..గుజరాత్ పశ్చిమ తీరంలో ఉంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ సోమనాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం మనదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. శివారాధకులు సోమనాథ్ ఆలయాన్ని అత్యంత గౌరవంగా భావిస్తారు. సోమనాథ్ ఆలయం గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
ఈ అద్భుతమైన జ్యోతిర్లింగం గురించి మీకు తెలియని 5 విషయాలేంటో చూద్దాం:
1. చాళుక్య రాజు మహారాజా మూలరాజు 997 CEకి ముందు సోమనాథ్‌లో మొదటి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.కానీ ఈ విషయానికి సంబంధించి కచ్చిమైన ఆధారాలు అంటూ ఏవీ లేవు. సోమనాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారనే అంశంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో నిర్మించిన గుడిని మూలరాజు మరింత డెవలప్ చేశారని..ఆలయ పరిమాణం, కొలతలు, పరిధిని మాత్రమే ఆయన విస్తరించడాని చరిత్రకారులు చెబుతున్నారు.
2. సోమనాథ్ ఆలయంలో అద్భుత రత్నం ఉందని చెబుతుంటారు. ఆ రత్నాన్ని తాకితే ప్రతిదీ బంగారంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శమంతక మణి శివుని జ్యోతిర్లింగం యొక్క బోలు లోపల దాచినట్లు చెబుతున్నారు.
3. సోమనాథ్ ఆలయం గురించి ఓ జానపద కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ కొలువైన శివుడిని ‘సోమనాథ్’ అని పిలుస్తుంటారు. సోమనాథ్ అంటే ‘చంద్రుని ప్రభువు’ అని అర్థం. పురాణాల ప్రకారం చూస్తే.. చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. అతని 27 మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు తన భార్యలందరినీ వదిలేయడంతో చంద్రుడిని ప్రవర్తన దక్షకు చిరాకు తెప్పిస్తుంది. దీంతో చంద్రుడిని శపించాడు. ఫలితంగా చంద్రుడు తక్కువ ప్రకాశంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి.
దక్ష శాపంతో చంద్రుడు విచారం వ్యక్తంచేస్తాడు. తనకు సహాయం చేయాలని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అయితే శివున్ని పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు. సోమనాథ్ ఆలయం దగ్గర ప్రస్తుత ప్రదేశంలో కూర్చొని చంద్రుడు కఠోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. తన కఠోర తపస్సును మెచ్చిన శివుడు వరం కోరుకోమన్నాడు. దక్ష శాపం నుంచి తనను విముక్తి చేయాలని చంద్రుడు కోరుడుతాడు. దీంతో తన ప్రకాశాన్ని తిరిగి పొందాడు. ఇందుకు కృతజ్ఞతాభావంతో చంద్రుడు శివునికి బంగారు ఆలయాన్ని నిర్మించాడు.ఈ ఆలయాన్ని రావణుడు వెండితో, శ్రీకృష్ణుడు చెక్కతో, పాండవుల్లో ఒకరైన భీముడు రాతితో నిర్మించారని జానపదకథ ప్రచారంలో ఉంది.
4. ఆలయం యొక్క 37 అడుగుల పొడవైన జెండా సిబ్బంది రోజుకు మూడు సార్లు తిప్పబడుతుంది. నిర్మాణం యొక్క శిఖరంపై ఉంది.
5. పురాణాల ప్రకారం, సరస్వతి, కపిల, హిరాన్ అనే మూడు నదుల పవిత్ర సంగమం అయినందున, ఆలయ నిర్మాణానికి ముందు సోమనాథ్ ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర.