నూనెతో దీపం వెలిగించడం సాధారణం. మనం దేవుడి గదిలో నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణం కలుగుతుంది. అయితే, ఉప్పు దీపం గురించి తెలుసా? దాని వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఎలా వెలగించాలి? వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
నూనెతో దీపం వెలిగించడం సాధారణం. మనం దేవుడి గదిలో నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణం కలుగుతుంది. అయితే, ఉప్పు దీపం గురించి తెలుసా? దాని వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఎలా వెలగించాలి? వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం. ఏ పూజకు అయినా, వ్రతానికైనా కావాలసిన వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒక మంచి రోజు బుధవారము కానీ, గురువారము కానీ ఒక పెద్ద మట్టి ముకుడును, రెండు ప్రమిదలను తెచ్చుకోవాలి. ఈ ముకుడుకు కానీ ప్రమిదలకు కానీ ఎలాంటి పగుళ్లు లేకుండా ముందుగానే గమనించి తీసుకోవాలి. వాటిని తీసుకున్న రోజే శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. మనం దీపాం పెట్టాలనుకున్న రోజు అనగా శుక్రవారము సాయంత్రం వేళ ఈ మట్టి ముకుడును, ప్రమిదలను పసుసుతో అలంకరించుకోవాలి, అంటే పసుపును నీటితో తడిపి ముకుడుకు, ప్రమిదలకు రాయాలి. ఆ తర్వాత కుంకుమతో అలంకరించుకోవాలి.
ఇప్పుడు ఇత్తడి, రాగి లేదా వెండి ప్లేట్‌ని తీసుకొని చక్కగా ప్లేట్‌కి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. మనం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. సముద్రపు ఉప్పుతో ఏ పరిహారం చేసినా మన ఇంట్లో ఉండే నెగటిన్ ఎనర్జీ పోతుంది. లక్ష్మీ దేవి తాండవం చేస్తూ మన ఇంట్లో తిస్ట వేసుకొని కుర్చుంటుంది. మనం ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో శుభ్రంగా పసుపుతో అలికి అష్టదల పద్మాన్ని వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా పసుపుతో అలికి అలంకరణ చేసుకున్న అష్టదల పద్మంపై మనం తీసుకున్న ప్లేట్‌ని పెట్టాలి. ఆ ప్లేట్‌పై ముకుడును పెట్టుకోవాలి. ఆ ముకుడులో శభ్రమైన కల్లుప్పును నింపాలి. మనం ప్రతిరోజు వాడే ఉప్పును వాడకూడదు. ఇలా ముకుడులో ఉప్పును నింపిన తర్వాత ఆ ఉప్పుపై ముందుగా పసుపు కుంకుమలతో అలంకరన చేసుకున్న ప్రమిదలను పెట్టుకోవాలి. ఈ ప్రమిదలను ఆవు నెయ్యితో గానీ నువ్వుల నూనెతో గానీ నింపాలి. రెండు వత్తులను తీసుకొని ఒకటిగా చేసి ఆ నూనెలో వేసుకోవాలి. ఆ తర్వాత వత్తులను వెలగించుకోవాలి. ఈ ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సాయంత్రం వేళలో వెలిగించుకోవాలి. ఇలా ఉప్పు దీపం వెలగించడం వల్ల మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల సంపదలు కలుగుతాయి.
