శ్రీచక్రంతో శివమొగ్గ ప్రత్యంగిరాదేవి అమ్మవారు.. మిరపకాయల యాగం ఇక్కడి ప్రత్యేకత

శివమొగ్గ విమానాశ్రయం ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ ప్రత్యంగిరా దేవి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు శ్రీ చక్ర సన్నిధానంలో జ్వలించే సహస్త్రసింహ ముఖం, శ్రీ శరీరం, చేతుల్లో భయంకరమైన ఆయుధాలతో శక్తి మాతగా కొలువై ఉంది.

shivamogga prathyangira devi temple

ప్రతీకాత్మక చిత్రం 

సనాతన ధర్మంలో రామాయణం, మహాభారతం అనే రెండు ఇతిహాసాలు.. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అనే నాలుగు వేదాలు ఉన్నాయి. ఈ నాల్గవ వేదమైన అథర్వణ వేదంలో అమ్మలకు అమ్మ ప్రత్యంగిరా దేవి ప్రస్తావన ఉంది. అథర్వణ వేదంలో, ప్రత్యంగిరా దేవిని క్రూరమైన,  దేవతగా చిత్రీకరించారు. ప్రత్యంగిరా దేవి అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే  శివమొగ్గ విమానాశ్రయం ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ ప్రత్యంగిరా దేవి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు  శ్రీ చక్ర సన్నిధానంలో జ్వలించే సహస్త్రసింహ ముఖం, శ్రీ శరీరం, చేతుల్లో భయంకరమైన ఆయుధాలతో శక్తి మాతగా కొలువై ఉంది.

1. ఈ ఆలయ ప్రత్యేకతలు:

ఇక్కడ ఉన్న ప్రత్యంగిరా  అమ్మవారి విగ్రహం చెక్కి, ప్రతిష్టించినది కాదు. అమ్మవారే స్వయంబుగా వెలిసారాని చెబుతుంటారు. కర్నాటకలో శ్రీ చక్రంతో ఉన్న ఏకైక ప్రత్యంగిరా దేవి శక్తిపీఠం ఇది. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజున శ్రీ పత్యంగిరా అమ్మవారికి ఎండు మిరపకాయలతో మహాయాగం జరుగుతుంది. 16 సంవత్సరాల వయస్సులో, శ్రీ సుప్రీత్ గురూజీ కలలో కనిపించి...ఆదిపరాశక్తిగా తాను కొలువై ఉంటానని ఆలయాన్ని నిర్మించాలని కలలో కనిపించి చెప్పారట.  సుప్రీత్ గురూజీ..అమ్మవారి ఆదేశానుసారం,  షిమోగాలో శ్రీ చక్రంతోఉన్న శ్రీ ప్రత్యంగిరా అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.

2. ఎండు మిరపకాయలతో యాగ విశిష్టత:

సాధారణంగా మిరపకాయలను నిప్పులో వేస్తే కారం వాసన ఆ ప్రదేశం అంతటా వ్యాపిస్తుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే..ఈ యాగం జరుగుతున్న సమయంలో అగ్నిలో ఎన్ని మిరపకాయలు వేసినా పొగ, వేడి రాకపోవడం ఇక్కడి ప్రత్యేకత. మిర్చి యాగమే కాకుండా ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు అద్దం బద్దలు కొట్టే ఆచారం ఉంది. చేతబడి, మంత్రం, దృష్టిలోపం, దెయ్యం వంటి సమస్యలు భగ్నమవుతాయి. శత్రుకథ, చేతబడి, భానామతి వంటి ప్రతికూల చర్యల వల్ల సమస్యలు ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వయంగా ఈ ఆలయానికి వచ్చి కారం పొడి మిరపకాయను మెత్తగా నూరి ఆది శక్తికి 5 ఆదివారం లేదా అమావాస్య, పౌర్ణమి రోజున రాస్తే, బలమైన సమస్యలు. పరిష్కారం అవుతాయని నమ్ముతుంటారు. అంతేకాదు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరికలు కోరుకుంటే కోటీశ్వరులు అవుతారని బలంగా నమ్ముతుంటారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్