మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతి దేవి పుట్టిన రోజుగా వసంత పంచమిని జరుపుకుంటారు. ఆ రోజున సరస్వతి దేవికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మాఘ మాసంలో ఐదవ రోజు నుంచి వసంత కాలం అనేది మొదలవుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
వసంత పంచమి పండుగను శ్రీ పంచమి అని, మధన పంచమి అని, సరస్వతి పంచమి అని,భసన్ పంచమి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. హిందువులంతా ఈ రోజును విశేషంగా జరుపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతి దేవి పుట్టిన రోజుగా వసంత పంచమిని జరుపుకుంటారు. ఆ రోజున సరస్వతి దేవికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మాఘ మాసంలో ఐదవ రోజు నుంచి వసంత కాలం అనేది మొదలవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవికి పూజ చేసేటప్పుడు తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే సరస్వతి దేవి సత్వగుణం నుండి పుట్టిందని, అందువల్ల అమ్మవారికి తెల్లని వస్త్రాలు అంటే చాలా ఇష్టమని నమ్ముతూంటారు. సరస్వతి దేవి సృజనాత్మక శక్తికి ప్రతిరూపం. జ్ఞానం, అభ్యాసం, సంగీతం, కలలకు దేవతగా కుడా అమ్మవారిని కొలుస్తారు. చాలా మంది పిల్లలకు మొట్టమొదటి అక్షరాలు, పదాలు రాయటం సరస్వతి పంచమి రోజు నుంచి ప్రారంభం చేస్తారు. ఈ రోజున చిన్న పిల్లలందరికి అక్షరాభాస్యం చేయిస్తారు. ఈ రోజున పుస్తక దానాలు, పెన్నులు, పెన్సిల్స్ దానం చేస్తే వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెబుతారు.
ఇంత విశేషమైన వసంత పంచమి.. ఈ నెల 2న (ఆదివారం) మధ్యాహ్నం 12:30 నిమిషాల నుంచి 3 ఫిబ్రవరి (సోమవారం) ఉదయం 10:15 వరకు ఉంటుంది. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం ఉదయం తెల్లవారి జామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకు పంచమి తిథి అనేది 3 ఫిబ్రవరి (సోమవారం) రోజున వసంత పంచమి జరుపుకోవాలి. ఈ రోజు రేవతి నక్షత్రం రాత్రి 2:36 వరకు తదుపరి అశ్వినీ నక్షత్రం ప్రారంభం అవుతుంది. వసంత పంచమి రోజు పూజలు చేసే వారు బ్రహ్మమూహుర్తం ఉదయం 3:30 నుంది 10:30 లోపల చేసుకోవాలి. ఈ రోజున అక్షరాభ్యాసం చేయించటానికి సరైన మూహుర్తం అని ఉండదు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏ సమయంలోనైనా సరే చేయడం శుభప్రదం. రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జ్యం ఇలాంటివన్నీ చూడాల్సిన అవసరం లేదు. అక్షరాభాస్యం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు.
వసంత పంచమి రోజున ఏ వయసు గల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే.. 3-5 ఏళ్ల వయసున్న చిన్నారులకు చేయించవచ్చని అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఏ మంత్రాన్ని జపించాలంటే ‘ఓం సరస్వతి దేవ్యై నమః’ అని పఠించి ఆ తర్వాత పలక మీద ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః అని అక్షరాభ్యాసంలో చెప్పించాలి.