ఓల్డ్ అల్వాల్ జొన్నబండ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు.. వివరాలివీ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||జొన్నబండ శివాలయం||

ఈవార్తలు, హైదరాబాద్: మహా శివరాత్రిని పురస్కరించుకొని ఓల్డ్ అల్వాల్ పరిధిలోని జొన్నబండ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం (పాత శివాలయం)లో మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ వెల్లడించింది. 16న ప్రత్యేక రుద్రాభిషేకం, రుద్రహోమం, 17న శివపార్వతుల కల్యాణం, పల్లకిసేవ, 18న (మహాశివరాత్రి రోజున) ఏకవార రుద్రాభిషేకం, 108 లీటర్ల ఆవుపాలతో, పండ్ల రసాలతో ఈశ్వరుడికి ప్రత్యేక రుద్రాభిషేకం, 19న మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ కొడారి నర్సింగ్ రావు, ప్రధానార్చకుడు రాజశేఖర శర్మ తెలిపారు. 19న ఉదయం 9 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు తమను సంప్రదించాలని సూచించారు.

పూజాకార్యక్రమ వివరాలు:

రుద్రహోమం - రూ.250

శివపార్వతుల కల్యాణోత్సవం - రూ.501

ఏకవార రుద్రాభిషేకం - రూ.251


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్