శ్రావణ మాసం శివుడిని ఆరాధించడానికి శ్రేయస్కరం.ఈ మాసంలో శివలింగానికి ఈ వస్తువులను సమర్పిస్తే..శివుడి అనుగ్రహం పొందుతారు.
ప్రతీకాత్మక చిత్రం
శ్రావణమాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసం పరమశివుని గౌరవించటానికి అంకితం చేయబడిన పవిత్రమైన మాసం. ఈ పవిత్ర మాసంలో, భక్తులు శివుని అనుగ్రహం కోసం ప్రతి సోమవారం నాడు ఉపవాసం, పూజలు చేస్తారు.శివుడిని చాలా మంది ఆరాధిస్తుంటారు.మీ కోరికలు, లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే శివుడిని భక్తితో వేడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం శివుని ఆరాధనకు అనుకూలం, శివుని అనుగ్రహం పొందడానికి శివలింగానికి ఈ వస్తువులను సమర్పించి అనుగ్రహాన్ని పొందండి.
శివుని అనుగ్రహం పొందడానికి శివలింగానికి సమర్పించాల్సిన వస్తువులు
1. పాలు
పాలు స్వచ్ఛతకు చిహ్నం. శివునికి పాలు సమర్పించడం ద్వారా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. భక్తుని మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడానికి పాలు సహాయపడుతుంది.కాల సర్పదోషం, రాహు దశ, చంద్రుడు రాహువు ఉన్నవారు శివునికి పాలతో అభిషేకం చేయడం మంచిది.
2. బిల్వపత్రం:
శివునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాన్ని సమర్పించడం అత్యంత పూజ్యమైనది. బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
3. తేనె:
తేనె సంపద, తీపికి చిహ్నం. భక్తులు శివలింగానికి తేనెను సమర్పించి శివుని అనుగ్రహం పొంది సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపాలి.
4. పెరుగు:
పెరుగును నైవేద్యంగా పెట్టడం అదృష్టం, ఐశ్వర్యానికి సంకేతం. కాబట్టి భక్తులు శివలింగానికి పెరుగును సమర్పించాలని సూచించారు. చంద్రుని దుష్ఫలితాలతో బాధపడేవారు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి.
5. నెయ్యి:
నెయ్యి శుద్దీకరణను సూచిస్తుంది. భక్తుని మనస్సు, ఆత్మను క్లియర్ చేస్తుందని.. అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. శివలింగానికి నెయ్యి సమర్పిస్తే జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
6. చెరకు రసం:
చెరుకు రసాన్ని సమర్పించడం శుభప్రదంగా భావించబడుతుంది . భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందడానికి దానిని సమర్పించాలి. శివునికి చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుంది.
7. గంగాజలం:
గంగాజలం అత్యంత పవిత్రమైనది. భక్తులు గంగా ఘాట్ నుండి తాజా గంగాజలాన్ని తీసుకువచ్చి శివలింగానికి సమర్పించాలి. ఇది స్వచ్ఛతకు చిహ్నం. దీనిని సమర్పించడం వలన చెడు కర్మలను వదిలించుకోవచ్చు. శివుని నుండి క్షమాపణ పొందవచ్చు.
8. చందనం:
జీవితంలో శాంతి కలగాలంటే శివలింగానికి చందనం పూయండి. అంగారకుడి చెడు ప్రభావంలో ఉన్నవారు దీనిని సమర్పించాలి. శివలింగానికి ఎర్రచందనం కూడా సమర్పించవచ్చు.
9.ధూపం:
ఇత్ర (ధూపం) భక్తి, స్వచ్ఛతకు చిహ్నం. మీ ప్రేమ, సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు శివలింగానికి ఇత్రను సమర్పించాలి.
10. చక్కెర (బూరా)
పంచామృతంలో భాగంగా శివలింగానికి పంచదార నైవేద్యంగా పెట్టాలి. మరొక కారణం ఏమిటంటే, శివలింగానికి తీపిని నైవేద్యంగా సమర్పించడం జీవితంలో శ్రేయస్సును కలిగిస్తుంది.