ఇంట్లో మనీప్లాంట్ ఈ దిశలో ఉంచితే అదృష్టం వరిస్తుంది

మనీప్లాంట్ ఇంట్లో ఉంటే అంతా కలిసివస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాటిటివ్ గా ఉంటుందని చాలా మంది అంటుంటారు. మనీప్లాంట్ నాటేందుకు మీ ఇంట్లో సరైన దిశ ఏదో తెలుసుకుందాం.

money plant

ప్రతీకాత్మక చిత్రం 

వాస్తు శాస్త్రంలో చాలా చెట్లు,మొక్కల గురించి ప్రస్తావన ఉంది. ఇంట్లో ఈ చెట్లు, మొక్కలు నాటడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్‌కు సంబంధించిన నియమాలు వాస్తు శాస్త్రంలో వివరంగా పేర్కొన్నారు. మనీప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల వాతావరణం స్వచ్ఛంగా ఉంటుందని, ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే కుటుంబ సభ్యులు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటండి:

మీరు మనీ ప్లాంట్ నాటాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిని ఇంటికి ఆగ్నేయ దిశలో నాటండి. వాస్తు ప్రకారం, ఈ దిశలో మనీ ప్లాంట్ నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనీ ప్లాంట్ కుబేరుడు, బుధుడికి సంబంధించినదిగా పరిగణిస్తారు కాబట్టి ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది.

ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటకండి:

ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం మానుకోవాలి. ఈ దిశలో మొక్కలు నాటడం వల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇది గుర్తుంచుకోండి:

ఇంటి బయట మనీ ప్లాంట్ నాటడం అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బయట నాటడం వల్ల బయటి వారి కళ్లు మొక్కపై పడతాయి. దాని వల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ చర్యలు చేయండి:

మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే , కొంచెం పాలను నీటిలో కలిపి మనీ ప్లాంట్‌కు అందించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆదాయం అపారంగా పెరుగుతుందని.. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్