OM Chanting | హిందువులు చదివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఏకాక్షర మంత్రం. ఓం లేదా ఓమ్ అని పలుకుతారు. ఈ మంత్రం త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. అ, ఉ, మకార శబ్దాలతో ఓం ఏర్పడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
హిందువులు చదివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఏకాక్షర మంత్రం. ఓం లేదా ఓమ్ అని పలుకుతారు. ఈ మంత్రం త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. అ, ఉ, మకార శబ్దాలతో ఓం ఏర్పడుతుంది. శబ్దాల్లో ఓం కారం మొదటిది. హిందు మతానికి బిందువు. దీన్ని పరమాత్మకు ప్రతీక అని చెప్తారు. అయితే దీన్ని పలకడం వల్ల జననావయం నుంచి తల వరకు శక్తి చేకూరుతుంది. ఓం పలికే సందర్భంలో మొదట శక్తి జననావయవాల దగ్గర ఉద్భవిస్తుంది. అది అనంతరం జీర్ణాశయానికి, ఆపై ఛాతికి, క్కడ నుండి తలకు చేరుతుంది. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ఓం అనే మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
రోజూ ఓం అనే మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల చాలా శక్తి ఉద్భవిస్తుంది. ఓ దశలో ఆధ్యాత్మిక స్థాయి పెరిగి దైవంతో మన ఆత్మ అనుసంధానం అవుతుంది. దీంతో ఒంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అనారోగ్యాలు నయమవుతాయి. ఓం మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల ఆక్సిజన్ సరఫరా, రక్త సరఫరా సరిగ్గా జరుగుతాయి. దీంతో మెదడుకు కొత్త శక్తి అందుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. డిప్రెషన్లో ఉన్న వారు నిత్యం ఓం మంత్రాన్ని చదివితే ఫలితం ఉంటుంది. కొత్త శక్తి, ఉత్సాహం వస్తాయి. చురుగ్గా మళ్లీ ఎప్పటిలా పనిచేసుకోగలుగుతారు.
మెదడుకు శక్తి ఎక్కవగా అందడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా అంశంపై దృష్టి సారిస్తే ధ్యాస తప్పకుండా ఉంటుంది. చదువుల్లో రాణించవచ్చు. విద్యార్థులకు బాగా మేలు జరుగుతుంది. ఓం మంత్రాన్ని రోజూ ఉచ్ఛరించడం వల్ల శరీరం, మనస్సు అన్నీ మన కంట్రోల్ కి వస్తాయి. అనవసరపు ఆలోచనలు రావు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఓం మంత్రాన్ని మనం అక్షరంతో రాస్తాం కదా.. అయితే ఈ అక్షరం వినాయకుడిని పోలి ఉంటుంది. అక్షర పైభాగం వినాయకుడి తలను, మధ్య భాగం తొండాన్ని, కింది భాగం వినాయకుడి పొట్టను సూచిస్తాయి. దీంతో ఓం ను ఉచ్ఛరించడం వలన వినాయకుడిని పూజించినట్టు కూడా అవుతుంది. ఇలా చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. స్వర పేటిక సమస్య ఉన్నవారు ఓం మంత్రాన్ని పఠిస్తే సమస్య పోతుంది. మృదువైన కంఠ స్వరం వస్తుంది. ఇస్లాంలో ఓంను సమా అని పిలుస్తారు. అక్షరం కూడా హిందూ ఓంను పోలి ఉంటుంది. దాంతో కూడా పైన చెప్పిన విధంగా ఫలితాలు కలుగుతాయి. రోజూ ఉదయాన్నే కనీసం 50 సార్లు ఓం మంత్రం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
గమనిక: ఆధ్యాత్మిక పండితుల ద్వారా సేకరించిన సమాచారం.