ఉగాది విశిష్టత ఏమిటో తెలుసా.. మన తెలుగు సంవత్సరాలకు యుగాల చరిత్ర

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


తెలుగు సంవత్సరంలోని హిందూ చాంద్రమాన క్యాలెండర్ లో చైత్రమాసంలో వచ్చే మొదటి రోజున "ఉగాది" పండుగ జరుపుకుంటారు. హిందువులకు ఉగాది పండుగతోనే కొత్త పంచాంగం మొదలవుతుంది.  ఈ సంవత్సరం ఉగాది మార్చి 22న శ్రీ శోభకృతు నామ సంవత్సర ఉగాది  జరుపుకుంటారు. మార్చి 21 రాత్రి 10.52 నిమిషాలకు మొదలై మార్చి 22 రాత్రి 8.20 నిమిషాలకు ముగుస్తుంది. అలాగే ఈ రోజున నుండి కొత్త యుగం ప్రారంభం అవుతుంది. 

ఉగాది విశిష్టత : 

పురాణాల ప్రకారం ఉగాది రోజున బ్రహ్మదేవుడు విశ్వసృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. బ్రహ్మదేవుడు ఈ రోజు నుండే రోజులు, రోజుల నుండి వారాలు. వారాల నుండి నెలలు. నెలల నుండి సంవత్సరాలను సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది పండుగను విశ్వసృష్టికి మొదలైన రోజుగా భావిస్తారు. అలాగే ఈరోజును సృష్టికర్త శ్రీ మహావిష్ణువు యొక్క పేరులో ఒకటిగా పరిగణిస్తారు. యుగాదికృత్ అనే పేరు నుండి ఉగాది వచ్చిందని ఈరోజున భక్తులు శ్రీ మహావిష్ణువు పూజించడం వలన సంతోషకరమైన జీవితాన్ని, సంపన్నమైన భోగభాగ్యాలతో శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందుతారని నమ్మకం.

ఉగాది రోజు ఏం చేయాలి : 

ఉగాది రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి అందమైన రంగవల్లిలతో వాకిలిని అందంగా అలంకరించుకోవాలి. ఇంటి గడపకు పసుపు రాసి ముద్దు పెట్టాలి. అలాగే మామిడి ఆకులతో తోరణాలు అలంకరించాలి. సాంప్రదాయ ఆచారాలను ఆచరిస్తూ తైల శుద్ధి చేసిన తర్వాత తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు. ఇవి రెండు ఉపయోగించి తలంటి స్నానం చేయడం వలన ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది.  ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం, ఇంద్రధ్వజ పూజ, బ్రహ్మధ్వజ పూజ, ఛత్రచామరాది స్వీకారం, రాజ దర్శనం తదితర పూజలు చేస్తారు. అలాగే ఈ రోజున షడ్రుచులతో తయారుచేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యంగా సమర్పించిన పచ్చడిని తాగాలి. ఉగాది ప్రత్యేక వంటలను తయారు చేసుకొని తినాలి. హిందూ దేవాలయాలను సందర్శించడం మంచిది. పంచాంగ శ్రావణం తెలుసుకోవాలి. 


పచ్చడిని ఎలా తయారు చేస్తారు : 

షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు.


తీపి : బెల్లం : ఆనందానికి సంకేతం

ఉప్పు : జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం

చేదు: వేప పువ్వు : బాధకలిగించే అనుభవాలు

పులుపు : చింతపండు : నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు

వగరు : పచ్చి మామిడి ముక్కలు : కొత్త సవాళ్లు

కారం : మిరపపొడి : సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు


ఉగాది ప్రత్యేక వంటకాలు : 

ఉగాది కొత్త సంవత్సరాన్ని పునారస్కరించుకొని పులిహోర, బొబ్బట్లు(భక్షాలు/ పోలెలు/బూరెలు), మామిడికాయ తో తయారు చేసిన వంటకాలు తయారుచేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి తినాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్