ఉగాది రాశిఫలాలు | క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వైశాఖ మాసంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.

krodhi nama rashi phalalu
ప్రతీకాత్మక చిత్రం

1. మేషం:

చైత్ర మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. రాహువు, శని మార్పు వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మంచి, చెడు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార విస్తరణను వాయిదా వేసుకోవడం మంచిది. జ్యేష్ఠ మాసంలో ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే వృథా ఖర్చులు ఉంటాయి. పెద్దల సలహాలు పాటించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆషాఢ మాసంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అప్పుల బాధ తీరుతుంది. బాధ్యతలను నిర్వహిస్తారు. కొత్త పరిచయస్తులతో పనులు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో సహోద్యోగులతో గొడవలు జరగవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. అధికారుల ఒత్తిడి వల్ల మన:శాంతి కరువవుతుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. భాద్రపద మాసంలో అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు, భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు. ఆశ్వీయుజ మాసంలో వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ నాయకులకు ఇది మంచి సమయం. కార్తీక మాసంలో వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.  అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. మార్గశిర మాసంలో తలపెట్టిన పనులు సమయంలో పూర్తవుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. తోటివారి విమర్శలతో ఇబ్బంది ఎదురవుతుంది. అయితే రాబడి బాగుంటుంది. పుష్య మాసం విద్యార్థులకు అనుకూల సమయం. పరీక్ష ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకొనే నిర్ణయాలతో  విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మాఘ మాసంలో గ్రహ స్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఫాల్గుణ మాసంలో ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే, బయట సమస్యలు ఇబ్బంది పెడతాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులు, మిత్రులతో ప్రయోజనాలు చేకూరుతాయి.

మేషరాశి వారికి గమనిక: గురువు జన్మరాశి (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ద్వితీయంలో ఉంటాడు. లాభంలో శని, వ్యయంలో రాహువు, ఆరింట కేతువు సంచరిస్తారు. గురువు, శని, కేతువు అనుకూల, రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు.

సానుకూల ఫలితాలకు: దుర్గాదేవి ఆరాధన చేయాలి.

2. వృషభం:

చైత్ర మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారం లాభాల్లో సాగుతుంది. వైశాఖ మాసంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. నలుగురికి సాయం చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటారు. పండుగలకు హాజరవుతారు. జ్యేష్ఠ మాసంలో ఆత్మీయులు, మిత్రుల సహకారం ఉంటుంది. కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధతో పనులు పూర్తి చేయాలి. ఉద్యోగులకు తోటివారితో ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఆషాఢ మాసంలో వ్యాపారులెవరైనా కొత్త లావాదేవీలకు దూరంగా ఉండడం బెటర్. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో అనుకూలం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శ్రావణ మాసంలో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. కళాకారులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. భాద్రపద మాసంలో పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యోగం కలుగుతుంది. ఆశ్వీయుజ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. సందర్భాన్ని బట్టి తీసుకొనే నిర్ణయాలతో సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్తీక మాసంలో అనవసరమైన ప్రయాణాలు. దాంతో అలసట, వృథా ఖర్చులు. పిల్లల విషయంలో నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, జాగ్రత్తగా ఉండాలి. మార్గశిర మాసంలో ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిభారం పెరిగి, అకాల భోజనం చేయాల్సి వస్తుంది. దాంతో అనారోగ్యం బారిన పడే చాన్స్ ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులు చేపడతారు. పుష్య మాసంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. బంధు, మిత్రులతో పనులు కలిసి వస్తాయి. వాహన, భూ లావాదేవీలకు ఈ సమయం అనుకూలం. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మాఘ మాసంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభాల్లో ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఆదరణ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొంటారు. ఫాల్గుణ మాసంలో నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల వల్ల అలసట, వృథా ఖర్చులు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశివారికి గమనిక: గురువు వ్యయంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా జన్మరాశిలో ఉంటాడు. రాజ్యంలో శని, లాభంలో రాహువు, పంచమంలో కేతువు సంచరిస్తారు. రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. గురువు, శని మిశ్రమ ఫలితాలు ఇస్తారు.

సానుకూల ఫలితాలకు: శివారాధన శుభప్రదం

3. మిథునం:

చైత్ర మాసంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పైఅధికారుల మద్దతు ఉంటుంది. అనవసరమైన ఖర్చుల వల్ల మనఃశాంతి పోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైశాఖ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి పెరుగుతుంది. బంధు మిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సలహాలు పాటిస్తే, ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. జ్యేష్ఠ మాసంలో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అప్పులు తీరుతాయి. ఉద్యోగులకు అనుకూలం. అధికారులతో సఖ్యత ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణాలు చేపడతారు. భూమి కొనుగోలు కలిసి వస్తుంది. ఆషాఢ మాసంలో అనవసరమైన ఖర్చులు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే చాన్స్ ఉంది. వాహన మరమ్మతులు ఉంటాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణతోపాటు ఆదాయ మార్గాలపై మనసు నిలపాలి. శ్రావణ మాసంలో విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగులకు పరపతి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.  గొడవలకు దూరంగా ఉండాలి. భాద్రపద మాసంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ వల్ల నష్టాలు రావొచ్చు. మనఃశాంతి కరువవుతుంది. ఓపికతో ముందుకు వెళ్లడం అవసరం. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆశ్వీయుజ మాసంలో వ్యాపారులకు భాగస్వాములతో భేదాలు రావొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తారు. కార్తీక మాసంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఒప్పందాలలో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండాలి. భూలావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. మార్గశిర మాసంలో ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. మిత్రులతో పనులు నెరవేరుతాయి. శ్రద్ధతో బాధ్యతలు  పూర్తిచేస్తారు. పుష్య మాసంలో విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కుటుంబ సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తే మంచిది. మాఘమాసంలో మాట పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. ఫాల్గుణ మాసంలో పనులను పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సోదరులు, బంధువుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం కలిసి వస్తుంది.

మిథున రాశివారికి గమనిక:  గురువు లాభంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా వ్యయంలో ఉంటాడు. భాగ్యంలో శని, రాజ్యంలో రాహువు, చతుర్థంలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు.

సానుకూల ఫలితాలకు: సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయాలి

4. కర్కాటకం:

చైత్రమాసంలో పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులతో జాగ్రత్త. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనసు పెడతారు. వైశాఖ మాసంలో అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అప్పు పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూలం. జ్యేష్ఠ మాసంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సంయమనం పాటించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. ఆషాఢ మాసంలో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పనులు సమయానికి పూర్తి అవుతాయి. దాంతో ఆనందం పెరుగుతుంది. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి పెడతారు. భాద్రపద మాసంలో ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు పనిభారం వల్ల మనఃశాంతి లోపిస్తుంది. వ్యాపారులు సమయానుకూల పెట్టుబడులతో లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో మనస్పర్ధలు రావొచ్చు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆశ్వీయుజ మాసంలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టండి. కార్తీక మాసంలో ఆదాయం పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. ఆస్తుల వల్ల రాబడి పెరుగుతుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. మార్గశిర మాసంలో సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణం కలిసి వస్తుంది. పుష్య మాసంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగ యోగం. మాఘ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఫాల్గుణ మాసంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చుల నియంత్రణ చేయాలి. విదేశీ ప్రయాణాలు, పైచదువులకు అనుకూలం. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త. కళాకారులకు అవకాశాలు వస్తాయి.

కర్కాటక రాశి వారికి గమనిక: ఈ రాశివారికి గురువు రాజ్యంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా లాభంలో ఉంటాడు. అష్టమం శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు సంచరిస్తారు. గురువు, రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. శని చికాకులు కలిగిస్తాడు.

సానుకూల ఫలితాలకు: శివారాధనతో శుభఫలితాలు పొందుతారు.

5. సింహం:

చైత్ర మాసంలో శుభఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వైశాఖ మాసంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. జ్యేష్ఠ మాసంలో ప్రథమార్ధం మిశ్రమంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో శుభఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆషాఢ మాసంలో గ్రహస్థితి మోస్తరుగా ఉంటుంది. వృథా ఆలోచనలతో పనుల్లో జాప్యం జరగవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. అలసటకు గురవుతారు. శ్రావణ మాసంలో రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు, చికాకులు ఉంటాయి. పొదుపుపై మనసు నిలుపుతారు. ఈ నెల ద్వితీయార్ధంలో మానసిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త. భాద్రపద మాసంలో ప్రధాన గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. సంయమనంతో వ్యవహరించాలి. పెద్దల సలహాలు తీసుకుంటారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. ఆశ్వీయుజ మాసంలో పనుల్లో శ్రమకు తగ్గ విజయం దక్కుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. కార్తీక మాసంలో ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కార్య నిర్వహణలో ఏమరుపాటు ఉండొద్దు. ఆదాయం స్థిరంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సంకల్పంతో ముందుకు వెళ్తారు. మార్గశిర మాసంలో పనుల్లో మొదట్లో ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. సరైన మార్గనిర్దేశం లభిస్తుంది. పుష్య మాసంలో ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. నెలాఖరులో నిర్మాణ పనులు చేపడతారు. మాఘ మాసంలో ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవడం అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం. శుభకార్య నిర్వహణలో అయినవారి సహకారం అందుతుంది. ఫాల్గుణ మాసంలో ఆదాయం స్థిరంగా ఉన్నా ఖర్చులూ ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

సింహరాశివారికి గమనిక: గురువు భాగ్యంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా దశమంలో, సప్తమంలో శని, అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల, రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. 

సానుకూల ఫలితాలకు: దుర్గాదేవి, గణపతి ఆరాధన మేలు.

6. కన్య:

చైత్ర మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వైశాఖ మాసంలో అనుకున్న సమయంలో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం అందుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆషాఢ మాసంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండాలి. పనులపై మనసు పెడితే మంచిది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహనంతో పనులు చేస్తారు. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. శ్రావణ మాసంలో శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం అందుతుంది. వ్యాపారులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవాలి. భాద్రపద మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పైఅధికారులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆశ్వీయుజ మాసంలో పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విహారయాత్రలు చేస్తారు.. శుభకార్య ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కార్తీక మాసంలో ప్రథమార్ధంలో ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ద్వితీయార్ధంలో కొన్ని ఆటంకాలున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. మార్గశిర మాసంలో గొడవలకు ఉంటూ పనులు నెరవేరుస్తారు. ఉద్యోగులకు పనిభారం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. పుష్య మాసంలో ఉద్యోగులు రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం. పనిచేసే చోట వివాదాలు తలెత్తవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మాఘ మాసంలో గ్రహస్థితి బాగుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. సాహితీవేత్తలకు గుర్తింపు లభిస్తుంది. ఫాల్గుణ మాసంలో ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ కనబరుస్తారు. మంచి ఫలితాలను పొందుతారు.

కన్య రాశివారికి గమనిక: గురువు అష్టమంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా భాగ్యంలో ఉంటాడు. ఆరింట శని, సప్తమంలో రాహువు, జన్మరాశిలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు.

సానుకూల ఫలితాలకు: దుర్గాదేవి, గణపతి ఆరాధన చేయాలి.

7. తుల:

చైత్ర మాసంలో మిశ్రమంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మాసాంతంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పదోన్నతి, స్థానచలన సూచన. వైశాఖ మాసంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంట్లో సహకారం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. స్నేహితులతో వాదన మంచిది కాదు. జ్యేష్ఠ మాసంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మాసాంతంలో పుంజుకుంటారు. ఆషాఢ మాసంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భూ లావాదేవీల్లో సత్ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణ పనులు చేపడతారు. కొత్త వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. అధికారులతో స్నేహంగా ఉంటారు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం బెటర్. భాద్రపద మాసంలో ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం పొందుతారు. బంధువుల తోడ్పాటు ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశ్వీయుజ మాసంలో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పనులలో నిమగ్నమై ఉంటారు. కార్తీక మాసంలో ప్రథమార్ధం కంటే మాసాంతంలో కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మార్గశిర మాసంలో కుటుంబ పెద్దలతో సఖ్యత ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. మాసాంతంలో ఆత్మీయులతో, కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఇబ్బందులు ఉండవచ్చు. పుష్య మాసంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. బాధ్యతలు నిర్వర్తించడంలో శ్రమ అధికం అవుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. మాఘ మాసంలో ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. స్వయం ఉపాధిలో ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి. ఫాల్గుణ మాసంలో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ప్రణాళికబద్ధంగా పనులు నెరవేరుస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విజయం. వివాదాలకు దూరంగా ఉండండి.

తుల రాశివారికి గమనిక: గురువు సప్తమంలో (ఏప్రిల్ 31), ఏడాదంతా అష్టమంలో ఉంటాడు. ఐదింట శని, ఆరింట రాహువు, వ్యయంలో కేతువు సంచరిస్తారు. శని, రాహుకేతువులు అనుకూల, గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తారు.

సానుకూల ఫలితాలకు: దత్తాత్రేయస్వామి ఆరాధనతో మేలు చేస్తుంది.

8. వృశ్చికం:

చైత్ర మాసంలో ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పైఅధికారుల మన్ననలు అందుకుంటారు. సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీదే. వైశాఖ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సహకారంతో పనులు పూర్తవుతాయి. జ్యేష్ఠ మాసంలో పనులు మొదట్లో మందకొడిగా సాగినా, సకాలంలో పూర్తవుతాయి. పట్టువిడుపులతో ప్రయోజనం పొందుతారు. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. భూములు, వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నెలాఖరులో అభీష్టసిద్ధి. శ్రావణ మాసంలో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భాద్రపద మాసంలో మొదలుపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు. ఆశ్వీయుజ మాసంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉండదు. మాసాంతంలో ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. కార్తీక మాసంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలు, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి. మార్గశిర మాసంలో ఉద్యోగులకు సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలం. పుష్య మాసంలో ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరినా, ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మాఘమాసంలో అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి గురవుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఫాల్గుణ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యస్థలంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. 

వృశ్చిక రాశివారికి గమనిక: గురువు ఆరింట (ఏప్రిల్31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా సప్తమంలో ఉంటాడు. నాలుగింట శని, ఐదింట రాహువు, లాభంలో కేతువు సంచరిస్తారు. గురువు, కేతువు పూర్తి అనుకూల ఫలితాలు ఇస్తారు. శని, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. 

సానుకూల ఫలితాలకు: శివుడు, దుర్గాదేవి ఆరాధన చేయాలి.

9. ధనుస్సు:

చైత్ర మాసంలో శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. వైశాఖ మాసంలో పనులు పూర్తి చేయడంలో సంయమనం, నైపుణ్యం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. వ్యాపారం సాఫీగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో ఇబ్బందులు రావచ్చు. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆషాఢ మాసంలో బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులు దగ్గర ఉండి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూలం. శ్రావణ మాసంలో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వివాదాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. భాద్రపద మాసంలో ఉద్యోగులు అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులుచేస్తారు. ఆశ్వీయుజ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. భూ తగాదాలు ముందుకు వస్తాయి. మనశ్శాంతి కొరవడుతుంది. వ్యాపార విస్తరణ వాయిదా పడుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. కార్తీక మాసంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. మనస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ధైర్యంతో ముందుకు సాగుతారు. రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. మార్గశిర మాసంలో వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శ్రమ అధికం. ఖర్చుల నియంత్రణ అవసరం. అధికారుల ఆదరణ ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. పుష్యమాసంలో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనులు వాయిదా పడతాయి. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మాఘ మాసంలో పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుంది. చివరికి విజయవంతంగా పూర్తిచేస్తారు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం  ఇవ్వకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆత్మీయులతో వివాదాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఫాల్గుణ మాసంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. సంయమనంతో ఉండటం మంచిది. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సహకారం లభిస్తుంది.

ధనుస్సు రాశివారికి గమనిక: గురువు ఐదింట (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ఆరింట ఉంటాడు. తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, రాజ్యంలో కేతువు సంచరిస్తారు. శని, కేతువు పూర్తి అనుకూల ఫలితాలు ఇస్తారు. గురువు, రాహువు మిశ్రమంగా ఉన్నారు.

సానుకూల ఫలితాలకు: శివుడు, దుర్గాదేవి ఆరాధన చేయాలి.

10. మకరం:

చైత్ర మాసంలో ఆదాయం పెరుగుతుంది. నెల చివర్లో బంధువులతో అభిప్రాయభేదాలు రావొచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో పనిచేయండి. వైశాఖ మాసంలో వివాదాలలోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. మానసిక సంఘర్షణకు గురవుతారు. ఉద్యోగం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు అవాంతరాలతో పూర్తవుతాయి. జ్యేష్ఠ మాసంలో రాబడి అస్థిరంగా ఉన్నా, డబ్బు సమకూరుతుంది. సహోద్యోగులు, అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఆషాఢ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ప్రయాణాల వల్ల అలసట, వృథా ఖర్చులు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. శ్రావణ మాసంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తిలో పనిభారం పెరిగినా, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంయమనంతో ఆలోచించండి. భాద్రపద మాసంలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పిల్లల చదువు కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీ ప్రయాణాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆశ్వీయుజ మాసంలో సంయమనంతో ఉండటం అవసరం. కుటుంబ సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పైచదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చు. కార్తీక మాసంలో ప్రణాళికతో పనులను చేస్తారు. స్వశక్తితో విజయం సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వాహనాలు, భూములు, ఆస్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం రావచ్చు. మార్గశిర మాసంలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల సమయం. మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. పుష్యమాసంలో అనుకున్న పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పరపతి పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల రాకతో ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మాఘ మాసంలో ఊహించని ఖర్చులు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను పొందుతారు. పైచదువులకు అనుకూలం. ఉత్సాహంతో ఉంటారు. ఫాల్గుణ మాసంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు, శ్రమాధికం ఉన్నా సకాలంలో పూర్తవుతాయి. మనఃశాంతి కోసం తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు.

మకర రాశివారికి గమనిక: గురువు చతుర్థంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ఐదింట ఉంటాడు. ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు సంచరిస్తారు. శని మినహా మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం కూడా తీరిపోతుంది. ఏదైనా మేలు తప్పకుండా కలుగుతుంది.

సానుకూల ఫలితాలకు: శివారాధన శుభప్రదం

11. కుంభం:

చైత్ర మాసంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత, సాహసం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. వైశాఖ మాసంలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జ్యేష్ఠ మసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఆషాఢ మాసంలో రాబడి పెరుగుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. శ్రావణ మాసంలో కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో మనశ్శాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కళాకారులకు ఈ నెల అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. భాద్రపద మాసంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయస్థులతో జాగ్రత్త. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆశ్వీయుజ మాసంలో ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్తీక మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనాలోచిత నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మార్గశిర మాసంలో దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. పుష్య మాసంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి. మాఘ మాసంలో బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీ యోగం. ఫాల్గుణ మాసంలో ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన చర్చలతో మనః:శాంతి కరువవుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించాలి. భూ లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు.

కుంభ రాశివారికి గమనిక: గురువు తృతీయం (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా చతుర్థంలో ఉంటాడు. జన్మరాశిలో శని, ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు సంచరిస్తారు. గురువు మినహా మిగిలిన గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నది.

సానుకూల ఫలితాలకు: శివుడు, దుర్గాదేవి ఆరాధన మేలు

12. మీనం:

చైత్ర మాసంలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి, సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు. వైశాఖ మాసంలో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. జ్యేష్ఠ మాసంలో ప్రారంభించిన పనులు మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ, తర్వాత అనుకూలంగా పూర్తవుతాయి. బంధువులు, స్నేహితుల వల్ల కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో మనస్పర్థలు రావచ్చు. ఆషాఢ మాసంలో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో కీర్తి ప్రతిష్ఠలు, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. విద్యార్థులకు అనుకూలం. శ్రావణ మాసంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభాల్లో ఉంటుంది. అనవసర చర్చల వల్ల మనఃశాంతి కొరవడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. భాద్రపద మాసంలో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతోషంతో పనులు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలతో అలసట పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆశ్వీయుజ మాసంలో కుటుంబ సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. సమయ పాలనతో సత్ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కార్తీక మాసంలో స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు వెళతారు. మార్గశిర మాసంలో కుటుంబంలో అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. పుష్య మాసంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో సత్కీర్తి పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురికి సాయపడతారు. మాఘ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పట్టుదలతో ఫలితాలు సాధిస్తారు. ఫాల్గుణ మాసంలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల అలసట, అనారోగ్య సూచన. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.

మీన రాశివారికి గమనిక:  గురువు ద్వితీయం (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా తృతీయంలో ఉంటాడు. వ్యయంలో శని, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచరిస్తారు. ప్రధాన గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నది. 

సానుకూల ఫలితాలకు: శివుడు, దుర్గాదేవి, వినాయకుడిని పూజించాలి.

రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం-అవమానం

రాశి                ఆ     వ్య   రా    

మేషం        8 14 4 3

వృషభం         2 8 7 3

మిథునం         5 5 3 6

కర్కాటకం 14 2 6 6

సింహం         2 14 2 2

కన్య                 5 5 5 2

తుల         2 8 1 5

వృశ్చికం         8 14 4 5

ధనుస్సు         11 5 7 5

మకరం         14 14 3 1

కుంభం         14 14 6 1

మీనం         11  5 2 4

ఆ-ఆదాయం, వ్య-వ్యయం, రా-రాజపూజ్యం, అ-అవమానం

వెబ్ స్టోరీస్