కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. నవంబర్ 9 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. నవంబర్ 9 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహించే ఈ కోటి దీపోత్పవాన్ని తొలిసారి 2012 లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహస్వామి ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వేడుక ప్రతి ఏడు వైభవంగా జరుగుతోంది. ఈసారి కోటి దీపోత్సవం 17 రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. నవంబర్ 9 నుండి 25 వరకు జరిగే ఈ ఉత్సవం.. ప్రవచనలు, ప్రత్యేక అర్చనలు, దేవతల కల్యాణ మహెూత్సవాలు, నీరాజనాలు ఇలా అన్ని పద్ధతులతో, భక్తుల భక్తి పారవశ్యంతో జరుగుతుంది.కోటి దీపోత్సవంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో వివిధ పుణ్యక్షేత్రాలలోని దేవతామూర్తుల రూపాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. కోటి దీపోత్సవం కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాకుండా, మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగే అరుదైన అవకాశం కలుగుతుంది. శివలింగానికి రుద్రాక్షలు, భస్మంతో అభిషేకం చేయడానికి నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కోటి దీపాల మధ్య శివకేశవులను దర్శించుకొనే ప్రత్యేకత ఈ కోటి దీపోత్సవంలో కలగనుంది. ప్రతిరోజూ సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ మహెూత్సవం ప్రారంభమవుతుంది.