జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి పెద్ద జయంతి వేడుకలకు ముస్తాబవుతోంది. త్వరలో వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గుట్ట కింది నుంచి పైకి వెళ్లే దారిలో భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేసింది.
కొండగట్టులో స్వాగత తోరణం ఏర్పాటు
ఈవార్తలు, కొండగట్టు : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి పెద్ద జయంతి వేడుకలకు ముస్తాబవుతోంది. త్వరలో వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గుట్ట కింది నుంచి పైకి వెళ్లే దారిలో భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేసింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎండాకాలం సందర్భంగా చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పిస్తోంది. ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలకు ఇబ్బందులు రాకుండా చూస్తోంది.
కాగా, భక్తులతో కొండగట్టు ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దీక్షాపరుల రాక మొదలైంది. కరీంనగర్, జగిత్యాల రహదారిపై ఎక్కడ చూసినా దీక్షాస్వాములే కనిపిస్తున్నారు. కాలినడకన స్వామిని దర్శనం చేసుకోవడానికి విచ్చేస్తున్నారు. 21, 41 రోజుల దీక్ష పూర్తి చేసుకొని, స్వామి సన్నిధిలో మాల విరమణ చేసి, అంజన్న మొక్కులు తీర్చుకుంటున్నారు.