Kondagattu : కాషాయమయమైన కొండగట్టు అంజన్న సన్నిధి.. లక్షలాదిగా తరలివస్తున్న భక్త కోటి

పెద్ద హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ ఆంజనేయస్వామి మాల స్వీకరించిన దీక్షాస్వాములు కాలినడకన గుట్టపైకి చేరుకున్నారు. మాల విరమణ చేసి, స్వామిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకుంటున్నారు.

kondagattu
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం

Kondagattu : పెద్ద హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ ఆంజనేయస్వామి మాల స్వీకరించిన దీక్షాస్వాములు కాలినడకన గుట్టపైకి చేరుకున్నారు. మాల విరమణ చేసి, స్వామిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో గుట్ట ప్రాంతమంతా కాషాయమయమైంది. జైశ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మార్మోగుతోంది. గత రెండు రోజులుగా కొండగట్టులో ఉత్సవాలు జరుగుతున్నాయి. దీని కోసం అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులు స్నానం చేసేందుకు వీలుగా కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గుట్టపైకి 4 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. మరోవైపు, ఎండవేడి తీవ్రంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘాట్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో సిబ్బంది లేక, నీటి సరఫరా లేక పాట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్