||శ్రీ ఆంజనేయస్వామి ఆలయం||
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన రూ.100 కోట్లతో మంగళవారం (ఫిబ్రవరి 21) నుండి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15న ముఖ్యమంత్రి ఆలయ పర్యటన చేసి అధికారులతో చర్చించి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో భక్తులు తమ ఊరిలోని హనుమాన్ ఆలయాల్లో కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో.. ఇంటింటి నుంచి మహిళలంతా హనుమంతుడికి కొబ్బరికాయ కొట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఎంపీ సంతోష్ కుమార్ కూడా కొండగట్టు అటవీ శాఖ ను దత్తత తీసుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్న విషయం తెలిసిందే.