ఈశాన్యం మూలలో ఇది ఉంచితే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందట

మీకు లక్ష్మీ దేవి కటాక్షం కలగడం లేదా? ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా? అయితే.. ఒక పనిచేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందని అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.

COPPER GOOD FOR HOME

ప్రతీకాత్మక చిత్రం

మీకు లక్ష్మీ దేవి కటాక్షం కలగడం లేదా?  ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా? అయితే.. ఒక పనిచేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందని అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. రాగి చెంబు అందుకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. చాలా చోట్ల రాగి చెంబులో నీళ్లు నింపి అందులో పువ్వులు వేసి ఒక మూలన పెట్టడం మీరు చూసే ఉంటారు. అసలు అలా ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? ఏ దిశన పెట్టాలి? అలా పెట్టిన రాగి చెంబును ఏ రోజున కడుక్కోవాలి? అంటే.. రాగి చెంబును సోమవారం లేదా గురువారం శుభ్రం చేసుకోవాలి. మంగళవారం లేదా శుక్రవారం రోజున రాగిచెంబును ఈశాన్య మూలలో పెట్టుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో కూడా మంగళవారం, శుక్రవారం శుభ్రం చేసుకోకూడదు. రాగి చెంబునే ఎందుకు పెట్టుకోవాలి అంటే.. రాగి రాబడిని తెస్తుందని అంటారు పెద్దలు. కాబట్టి రాగి చెంబు వాడటం మంచిది.

రాగి చెంబును ముందుగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత రాగి చెంబు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు పెట్టుకోవాలి. స్వస్తిక్ అంటే శుభ సూచికం కనుక స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు వేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు ఆ స్వస్తిక్ గుర్తులో పెట్టుకోవాలి. ఆ రాగి చెంబులో నిండుగా మంచి నీళ్లు పొసుకోవాలి. అలా నీటిని పోసిన తర్వాత నీటిలో పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, ఒక రూపాయి, రెండు పవ్వులు, పచ్చకర్పూరం వేసుకోవాలి. ఈశాన్య మూలను శుభ్రం చేసుకొని, పద్మం ముగ్గు వేసుకోవాలి. పద్మం ముగ్గు ఎక్కడైతే వేస్తామో అక్కడ లక్ష్మీదేవి వచ్చి కుర్చుంటుందని పెద్దలు అంటారు కదా.. అందుకని పద్మం ముగ్గు వేసుకోవడం మంచిది. వేసుకున్న పద్మం ముగ్గును పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి.  మనకు ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవడం వీలు కాకపోతే, పూజ గదిలో ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు. పసుపు, కుంకుమతో అలంకరించిన పద్మం ముగ్గుపై తమలపాకు గానీ, ఒక ప్లేట్ గానీ పెట్టి అలంకరించిన రాగి చెంబును దాని పైన పెట్టుకోవాలి. కచ్చితంగా ఈ రాగి చెంబు ఈశాన్య మూలలోనే ఉండేలా చూసుకోవాలి. ఇలా రాగి చెంబును ఈశాన్య మూలన పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్