జగిత్యాల జిల్లాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దుర్గా నవరాత్రులు నిర్వహించే నవదుర్గాసేవాసమితి ఆధ్వర్యంలో మోతె శివారులోని గోవిందుపల్లెలో ఉన్న నవదుర్గా పీఠ క్షేత్రంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు.
దుర్గా మాత
జగిత్యాల, ఈవార్తలు : జగిత్యాల జిల్లాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దుర్గా నవరాత్రులు నిర్వహించే నవదుర్గాసేవాసమితి ఆధ్వర్యంలో మోతె శివారులోని గోవిందుపల్లెలో ఉన్న నవదుర్గా పీఠ క్షేత్రంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ 17న (ఆదివారం) ఆలయ శంకుస్థాపన నిర్వహించనున్నారు. దీనికోసం భక్తులకు నిర్వాహకులు కీలక పిలుపునిచ్చారు. భక్తులంతా శంకుస్థాపనలో పాల్గొనాలని.. ఒక రాగి పైసా, ముత్యం, పగడం తీసుకొచ్చి శంకుస్థాపన కోసం అందించాలని పిలుపునిచ్చారు. శంకుస్థాపనలో పాల్గొని అమ్మవారి సేవలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ప్రతి ఏటా అత్యంత వైభవోపేతంగా, అమ్మవారు ఇక్కడే కొలువుదీరారు అన్నంత ఘనంగా నవదుర్గాసేవాసమితి-జగిత్యాల ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు వరకు పట్టణంలోని మార్కండేయ టెంపుల్ ఆవరణలో అమ్మవారి నవరాత్రులు జరగ్గా, గత కొన్ని సంవత్సరాల నుంచి నవదుర్గా పీఠ క్షేత్రంలో (అమ్మవారికి చెందిన భూమి) జరుపుతున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా స్థలం ఉన్నందున ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని నిర్వాహకులు సంకల్పించారు. ఈ మేరకు భక్తులు శంకుస్థాపన మహోత్సవానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.