IRCTC South Trip: శ్రావణమాసంలో తక్కువ ధరకే పుణ్యక్షేత్రాల దర్శనం..IRCTC ప్రత్యేక ప్యాకేజీ..సికింద్రాబాద్ నుంచే

మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునేవారికి IRCTC కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది.ఈ ప్యాకేజీ ద్వారా మీరు తక్కువ ధరలలో జ్యోతిర్లింగాలను చూడవచ్చు.

IRCTC South Trip

ప్రతీకాత్మక చిత్రం 

శ్రావణ మాసంలో శివుడిని విశేషంగా పూజిస్తారు. ఈ మాసంలో శివుని పవిత్ర స్థలాలను సందర్శించడానికి చాలా మంది ఇష్టపడతారు.దీంతో IRCTC సమయానికి అనుగుణంగా టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా తక్కువ ధరలో అనేక ఉత్తమ ప్రదేశాలను సందర్శించవచ్చు. భారతీయ రైల్వేలో శివ భక్తులకు ప్రత్యేక ఆఫర్ ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఆగస్టు 6 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఇది అద్భుతమైన టూర్ ప్యాకేజీ. ఈ సందర్భంలో IRCTC తీసుకొచ్చిన టూర్ ప్యాకేజీ ధర ఎంత? ఈ పర్యటన ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎలా బుక్ చేయాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

దివ్య దక్షిణ యాత్ర:

IRCTC ఈ ప్రత్యేక ప్యాకేజీని 'దివ్య దక్షిణ యాత్ర' అంటారు. ఈ ప్యాకేజీతో మీరు దేశంలోని వివిధ ప్రాంతాలలో జ్యోతిర్లింగాలను చూడవచ్చు. ఇప్పుడు ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. IRCTC జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల పాటు జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా 8 రాత్రులు  9 పగళ్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పర్యటన 4 ఆగస్టు 2024 నుండి ప్రారంభమవుతుందని IRCTC ప్రకటించింది.

ఎన్ని రోజుల ప్రయాణం?

IRCTC శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ముఖ్యంగా వర్షకాలంలో ప్రయాణించాలనుకునే వారికి ఇది అద్భుతమైన బహుమతిగా మారుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో మీరు కన్యాకుమారి, తంజావూరు, తిరువనంతపురం, మధురై, అరుణాచలం, రామేశ్వరం మొదలైన పర్యాటక ప్రదేశాలతో పాటు రెండు జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా నడుస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్ కూడా ఉంది.

ప్రవేశ రుసుము ఎంత?

ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తక్కువ బడ్జెట్‌లో ఉంటుంది. మీరు ఎకానమీ క్లాస్ (స్లీపర్) బుక్ చేసుకుంటే 9 రోజుల ట్రిప్ కోసం రూ.14,250 చెల్లించాలి. అయితే మీరు వీలైనంత త్వరగా ఈ పర్యటన కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. అలాగే, స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) కేటగిరీని ఎంచుకుంటే రూ.21,900, కంఫర్ట్ (2ఏసీ) కావాలంటే రూ.28,450 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల పిల్లలు మీతో ప్రయాణిస్తున్నట్లయితే, వారు ఎకానమీకి రూ.13,250, స్టాండర్డ్ కోటా కోసం రూ.20,700 మరియు కంఫర్ట్ ప్యాకేజీకి రూ.27,010 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఉచితం: 

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆహారం (టిఫిన్, లంచ్) వసతి అన్నీ ఉచితం అని IRCTC ప్రకటించింది. పర్యటనలో భాగంగా సందర్శనా రవాణా, వసతి, ఆహారం అన్నీ ప్యాకేజీలో చేర్చారు. అంతేకాకుండా, దక్షిణ భారతదేశంలోని అనేక అందమైన పర్యాటక,చారిత్రక ప్రదేశాలను ఉచితంగా చూడవచ్చు. 9 రోజుల పర్యటన తర్వాత మీరు సికింద్రాబాద్ స్టేషన్‌కు తిరిగి వస్తారు.

ఇలా బుక్ చేసుకోండి: 

ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు ఈ లింక్ https://www.irctctourism.com/tourpackageBookingను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా బుక్ చేసుకోవచ్చు లేదా ఈ ఫోన్ నంబర్‌లు 92814495845 లేదా 92814495843 లేదా 040-27702407ను సంప్రదించండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్