ఇండోనేషియాలో మన భారతీయ సంసృతిని ప్రతిబింబించే ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి కాండీ సాంబీసారీ. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది.
ప్రతీకాత్మక చిత్రం
భారతీయ సంసృతి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాలకు వేల సంవత్సరాల క్రితమే విస్తరించింది. కొన్ని వర్గాలు భారతీయ సంసృతి ఆనవాళ్లను లేకుండా చేద్దామనుకున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నాటి వైభవం తాలూకు అవశేషాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇండోనేషియాలో మన భారతీయ సంసృతిని ప్రతిబింబించే ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి కాండీ సాంబీసారీ. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది. 1966లో యోగ్యకర్త అనే ప్రాంతంలో ఎప్పటిలాగే వ్యవసాయ పనులు చేసుకునేందుకు పొలంలోకి అడుగు పెట్టిన ఆ రైతు భుమిని దున్నడం మొదలు పెట్టాడు. నాగలి పెట్టి దున్నడం మొదలు పెట్టిన కొద్దిసేపటికే నాగలి భూమిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా నాగలి ముందుకు నడవలేదు. దీంతో అక్కడ ఏం ఉంది అని తవ్వి చూస్తే లింగకారంలో ఒక శిల బయటపడింది. దీంతో ఆశ్చర్యపోయిన అతడి ఆ విషయాన్ని అధికారులకు వెల్లడించారు.
అధికారులు అక్కడ ఏదో పురాతన విగ్రహం ఉందని తవ్వడం మొదలుపెట్టారు. తవ్వుతున్నకొద్దీ ఏకంగా ఒక భారీ విగ్రహమే బయటపడింది. ఇంకాస్త తవ్వే సరికి పురాతన ఆలయం బయటపడింది. ఆలయం మొత్తాన్నీ బయటకు తీసేసరికి 21 ఏళ్లు పట్టింది ఆ అధికారులకు. 1987 మార్చిలో ఈ ఆలయానికి పూర్తి రూపాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ఉన్న ఆలయం స్థానిక గ్రామానికి 20 అడుగున దిగువుగా ఉండటం గమనార్హం. మెరాబీ అగ్ని పర్వతం బద్దలయిన్నప్పుడు ఆ మట్టి వల్ల ఈ ఆలయం మట్టిలోకి కురుకుపోయింది అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది 9వ శతబ్దానికి చెందిన ఆలయంగా పేర్కొంటున్నారు. అయితే గ్రామ ప్రజలు మాత్రం శాస్త్రవేత్తల అంచనా కంటే 10 రెట్లు పురాతణమై ఉంటుందని అంటున్నారు. ఆలయా తవ్వకాలలో ఓ బంగారు పలక లభించింది. ఇందులో సంసృతంలో ఓం శివ స్థానం అని రాసి ఉంది. ఉత్తరం వైపు దుర్గాదేవి విగ్రహం, తూర్పు వైపు గణపతి విగ్రహం, దక్షిణం వైపు అగస్త్యుడి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. ఇక పశ్చిమ దిక్కున ఉన్న గర్భాలయంలో 6 అడుగుల పైన ఎత్తు ఉన్న శివాలయం దర్శనం ఇస్తుంది. ఒకప్పుడు ఈ శివలింగం బంగారు తాపడంతో అలంకృతమై వైభవంగా పూజలను అందుకునేది. ఇప్పటికి ఈ లింగాన్ని పరీశిలిస్తే ఆ బంగారు తాపడపు తాలుకూ అనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి.