తులసికోట ఈ దిక్కున పెడితే సిరిసంపదలు మీ సొంతం

సహజంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసికోట ఉండడం మనం చూస్తునే ఉంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కో దిక్కులో పెడుతుంటారు. కొందరు తూర్పున పెట్టుకోవాలి అని, మరికొందరు పడమరన పెట్టుకోవాలని, ఇంకా కొందరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెబుతుంటారు.

tulasi plant

ప్రతీకాత్మక చిత్రం

సహజంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసికోట ఉండడం మనం చూస్తునే ఉంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కో దిక్కులో పెడుతుంటారు. కొందరు తూర్పున పెట్టుకోవాలి అని, మరికొందరు పడమరన పెట్టుకోవాలని, ఇంకా కొందరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెబుతుంటారు. అసలు వాస్తు ప్రకారం తులసికోటను ఏ దిక్కున పెట్టుకోవాలి? ఏ దిక్కున పెడితే ఐశ్వర్యం కలుగుతుంది? అనే విషయం తెలుసుకుందాం. దేవీ భాగవతం ప్రకారం, బ్రాహ్మవైరా పురాణాల ప్రకారం తులసికోట ఏ దిక్కులో ఉన్నా సరే సకల సుఖాలు కలుగుతాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కులో అయినా తులసికోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఒక్కో దిక్కున తులసికోట ఉంచితే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది.

తూర్పు దిక్కున తులసికోట ఉంటే దీర్ఘసుమంగళి తత్వం కలుగుతుంది. పడమర దిక్కున తులసికోటను ఉంచితే పిల్లల జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. తులసికోట ఉత్తరం దిక్కున ఉంటే ఐశ్వర్యం బాగా కలుగుతుంది. అలాగే దక్షిణం దిక్కులో ఉంచితే మోక్షం కలుగుతుంది. సహజంగా ఎప్పుడైనా సరే తులసికోట తూర్పు దిక్కున గానీ, ఉత్తరం దిక్కున గానీ ఉంచితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పరిహర శాస్త్రంలో ఉంది. అలాగే మీ సింహ ద్వారాన్ని బట్టి కూడా తులసికోటను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే సింహ ద్వారం తెరవగానే ఎదురుగా తులసి మొక్క ఉండటం చాలా మంచిది. ఇంటి సింహద్వారానికి ఎదురుగా తులసికోటను ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.  తులసికోట ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో ఉన్నా, ఆగ్నేయంలో ఉన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

తులసికోటలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను కచ్చితంగా పాటిస్తేనే తులసిమాత అనుగ్రహం వల్ల ఐశ్వర్యం, సిరిసంపదలు కలుగుతాయి. తులసికోటలో శివ లింగం ఉంచి పూజిస్తే విశేషమైన ధన యోగం కలుగుతుంది. కానీ తులసికోటలో ఎప్పుడు కూడా పసుపు గణపతిని ఉంచకూడదు. తులసికోటకు దీపం పెట్టినప్పుడు తులసికోటకు మూడు అంగుళాల దూరంటో దీపం పెట్టాలి. తులసి దళాలతో ఎప్పుడైనా పూజ చేయవలసి వస్తే మీరు రోజూ పూజ చేసే తులసికోటలోని దళాలతో చేయకూడదు. తులసికోట పక్కనే ఇంకో మొక్క పెంచుకొని ఆ మొక్కకు ఉన్నటువంటి తులసి దళాలను వాడుకోవాలి. తులసికోట విషయంలో ఈ ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తేనే మీకు తులసికోట ఐశ్వర్యం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్