vastu: ఇంటి ముందు ఈ పని చేస్తే లక్ష్మిదేవి కటాక్షం కలుగుతుంది

మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, లక్ష్మి దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి ఇంటి ముందు ఈ పనులు చేయాలి. ఇంటి ముందు ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.?తెలుసుకుందాం.

vastu

ప్రతీకాత్మక చిత్రం 

హిందూ మతంలో, వారంలోని అన్ని రోజులలో ఆయా దేవతలను పూజిస్తారు.ఇలా ప్రతి దేవుడికి పూజలు చేస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా జీవితంలో విజయం పొందవచ్చు. అలాగే భగవంతుని  ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్ధిక సమస్యల నుండి బయటపడటానికి లక్ష్మీ దేవిని పూజించాలి. అమ్మవారిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు, ఆదాయం పెరుగుతుంది. ఇంటి పెరట్లో ఇలా ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. లక్ష్మి దేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ముందు ఏం చేయాలి.?

వినాయక విగ్రహం:

ప్రధాన ద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని ఉంచండి. ఇది పనిలో విజయాన్ని పొందే అవకాశాలను పెంచుతుంది. ఇంట్లో ఆనందం స్థిరపడుతుంది. ఈ సమయంలో, తలుపు మీద మంచి - లాభం అని వ్రాయడం కూడా శ్రేయస్కరం. ఇది మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది.

స్వస్తిక చిహ్నం:

స్వస్తిక చిహ్నం హిందూమతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఏ శుభ కార్యమైనా, పూజ అయినా ఇంటి ముందు స్వస్తికాన్ని ఉంచి ప్రారంభిస్తారు. ఇది మీ ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా చేయాలి.ఇది కుటుంబంలో సానుకూలతను తెస్తుంది. ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక చిహ్నం ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు.

తులసి మొక్క:

తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి ముందు తులసి మొక్కను ఉంచడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుంది. ఈ సమయంలో ప్రధాన ద్వారం దగ్గర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు ప్రయత్నించాలి.

రంగోలి:

ఇంటి  ప్రధాన ద్వారం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తలుపు మీద చిన్న రంగోలి లేదా లక్ష్మీ దేవి పాదముద్ర వేయాలి. ఇది కుటుంబంలో ఆనందాన్ని తెస్తుంది.

నెయ్యి దీపం:

హిందూ మతంలో పూజకు ప్రత్యేక నియమాలు పాటిస్తారు. ఈ నియమాలను పాటించడం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి రోజూ పూజ చేయాలి. అలాగే ఒక పాత్రలో నీళ్లు, పసుపు కలిపి ఇంటి మెయిన్ డోర్ పై చల్లాలి. అలాగే సాయంత్రం వేళ గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. అది మీకు పుణ్యాన్ని తెస్తుంది.

సూర్య యంత్రం:

మీ ఇంటి ప్రధాన ద్వారం మీద సూర్య దేవ యంత్రాన్ని అమర్చాలి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సూర్య యంత్రాన్ని అమర్చడం వల్ల కుటుంబ కలహాలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి , ప్రశాంతత నెలకుంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్